Home » Tag » Ravichandran Ashwin
ఆసియా దేశాల్లో పిచ్ లు స్పిన్ కే అనుకూలంగా ఉంటాయన్నది తెలిసిందే.. ఎంత అనుకూలంగా ఉన్న బౌలింగ్ వేరియేషన్ లేకుంటే వికెట్లు తీయలేరు.. ఇది ఎవ్వరైనా అంగీకరించాల్సిందే...
బంగ్లాదేశ్ తో తొలి టెస్టులో సెంచరీ బాదిన రవిచంద్రన్ అశ్విన్ పై ప్రశంసల జల్లు కురుస్తోంది.
హోం గ్రౌండ్ లో రవిచంద్రన్ అశ్విన్ దుమ్మురేపాడు. చెన్నై చెపాక్ స్టేడియంలో ఈ సారి బంతి కంటే ముందే బ్యాట్ తో అదరగొట్టాడు. కీలక సమయంలో సెంచరీ చేయడమే కాదు జట్టుకు భారీస్కోరు అందించాడు.
తొలి ఇన్నింగ్స్‌లో 4 వికెట్లు పడగొట్టిన యాష్.. రెండో ఇన్నింగ్స్‌లో 5 వికెట్లతో సత్తాచాటాడు. జాక్ క్రాలీ, డకెట్, పోప్ వంటి కీలక వికెట్లు పడగొట్టి ఇంగ్లిష్ జట్టును దెబ్బతీశాడు. ఓవరాల్‌గా అశ్విన్ తన వందో టెస్టులో 9 వికెట్లు పడగొట్టాడు.
ఐదో టెస్టులో భారత్ ఘన విజయం సాధించింది. ఇన్నింగ్స్ 64 పరుగుల తేడాతో ఇంగ్లండ్‌పై గెలిచింది. దీంతో టెస్టు సిరీస్ 4-1తో భారత్ కైవసమైంది. ఐదు టెస్టుల సిరీస్‌లో హైదరాబాద్‌లో జరిగిన తొలి టెస్టు మినహా మిగతా నాలుగు టెస్టుల్లో వరుసగా ఇండియా గెలవడం విశేషం.
తొలి రోజు టాస్ గెలిచిన ఇంగ్లండ్ బ్యాటింగ్ ఎంచుకుంది. ఇంగ్లండ్ బ్యాటర్లను భారత బౌలర్లు అడ్డుకున్నారు. స్పిన్ త్రయం అశ్విన్, కుల్దీప్ యాదవ్ చెలరేగడంతో తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ 57.4 ఓవర్లలో 218 పరుగులకు ఆలౌటైంది.
ఇప్పటికే సిరీస్‌ను 3-1తో కైవసం చేసుకున్న భారత్‌కు ఆఖరి మ్యాచ్‌లో అశ్విన్ మరోసారి మ్యాజిక్ చేసి ఇంకో విజయాన్ని అందిస్తాడా అనేది ఆసక్తికరంగా మారింది. ఈ సిరీస్‌ను టీమ్ ఇండియా కైవసం చేసుకోవడంలో అశ్విన్ కీలకపాత్ర పోషించాడు.
టీమిండియా ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్, ఇంగ్లండ్ క్రికెటర్ జానీ బెయిర్‌స్టోకు ఈ మ్యాచ్ వారి కెరీర్లో వందో టెస్ట్. 147 ఏళ్ల టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఒకే మ్యాచ్‌తో వేర్వేరు జట్లకు చెందిన ఇద్దరు ఆటగాళ్లు 100 టెస్ట్‌ల మార్కును అందుకోవడం ఇది మూడోసారి మాత్రమే.
విజయానికి మరో 72 పరుగులు అవసరమైన దశలో జట్టును గిల్, జురెల్ ఆదుకున్నారు. వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడి జట్టును విజయ తీరాలకు చేర్చారు. దీంతో ఐదు టెస్టుల సిరీస్‌ను భారత్ 3-1తో కైవసం చేసుకుంది.