Home » Tag » RCB
ఐపీఎల్ మెగావేలానికి ముందు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తమ సపోర్టింగ్ స్టాఫ్ పై ఫోకస్ పెట్టింది. తమ బౌలింగ్ కోచ్గా ముంబై రంజీ టీమ్ హెడ్ కోచ్ ఓంకార్ సాల్విని నియమించిందిదేశవాళీ క్రికెట్ సీజన్ ముగిసిన తర్వాత ఆర్సీబీ బౌలింగ్ కోచ్గా బాధ్యతలు చేపట్టనున్నాడు.
గ్లెన్ మాక్స్ వెల్... ఈ పేరు చెప్పగానే విధ్వంసకర బ్యాటింగే గుర్తొస్తుంది. ఒంటిచేత్తో ఓడిపోయే మ్యాచ్ ను గెలిపించగలడు... టీ ట్వంటీల్లో అయితే మాక్స్ వెల్ దూకుడు గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అయితే గత కొంతకాలంగా అనుకున్న స్థాయిలో అతని ఆటతీరు లేదు.
ఐపీఎల్ మెగావేలంలో ఈ సారి ఎవరికి భారీ ధర పలకబోతోందన్న అంచనాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం ముగ్గురు కెప్టెన్లు శ్రేయాస్ అయ్యర్, రిషబ్ పంత్, కెఎల్ రాహుల్ కోసం గట్టి డిమాండ్ ఉండడం ఖాయంగా కనిపిస్తోంది.
ఐపీఎల్ మెగావేలానికి సమయం దగ్గర పడుతోంది. నవంబర్ 24,25 తేదీల్లో సౌదీఅరేబియా సిటీ జెడ్డాలో ఐపీఎల్ ఆటగాళ్ళ వేలం జరగబోతోంది. ఇప్పటికే రిటెన్షన్ ప్రక్రియ ముగిసిపోగా.. ఈసారి మెగా వేలంలో మొత్తం 1,574 మంది క్రికెటర్లు పేర్లు నమోదు చేసుకున్నారు.
ఐపీఎల్ రిటెన్షన్ హడావుడి ముగిసిపోవడంతో ఇప్పుడు మెగా వేలం కోసం కౌంట్ డౌన్ మొదలైంది. అదే సమయంలో కొన్ని జట్లకు కొత్త కెప్టెన్లు రాబోతున్నారు. ఇప్పటి వరకూ ఒక్కసారి కూడా టైటిల్ గెలవని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు రిటెన్షన్ లో వ్యూహాత్మకంగా వ్యవహరించింది.
ఐపీఎల్ మెగా వేలం కోసం క్రికెట్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇటీవలే రిటెన్షన్ ప్రొసీజర్ కూడా ముగిసింది. ఫ్రాంచైజీలు వ్యూహాత్మకంగా వ్యవహరించి తమ తమ పరిధిలో ప్లేయర్స్ ను రిటైన్ చేసుకున్నాయి.
ఐపీఎల్ మెగా వేలం ఈ సారి రసవత్తరంగా ఉండబోతోంది. చాలా ఏళ్ళ తర్వాత పలువురు స్టార్ ప్లేయర్స్ వేలంలోకి రావడమే దీనికి కారణం. తమ తమ జట్టు కూర్పుపై తర్జన భర్జన పడిన కొన్ని ఫ్రాంచైజీలు కీలక ఆటగాళ్ళను వదలుకోక తప్పలేదు.
ఐపీఎల్ మెగావేలానికి ముందు ఫ్రాంచైజీలు తమ రిటెన్షన్ జాబితాలను ప్రకటించాయి. కొన్ని ఊహించిన రిటెన్షన్లు ఉంటే.. మరికొన్ని ఊహించని రిటెన్షన్లు కూడా కనిపించాయి. గత సీజన్ లో రన్నరప్ గా నిలిచిన సన్ రైజర్స్ సంచలన నిర్ణయాలతో ఆశ్చర్యపరిచింది.
ఐపీఎల్ మెగావేలానికి ముందు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కీలక నిర్ణయం తీసుకుంది. కెప్టెన్ గా విరాట్ కోహ్లీకి బాధ్యతలు అప్పగించాలని నిర్ణయించినట్టు సమాచారం. దీనిపై కోహ్లీ కూడా సానుకూలంగా స్పందించడంతో ఇక అధికారిక ప్రకటనే మిగిలింది.