Home » Tag » Resignation
వైసీపీ (YCP) ఓడిపోయి టీడీపీ (TDP) అధినేత చంద్రబాబు నాయుడు ఏపీ సీఎంగా అధికారం చేపట్టబోతున్నారు. దాంతో టీటీడీ ఛైర్మన్ పోస్టుకు కరుణాకర్ రెడ్డి రాజీనామా చేశారు. ఇప్పుడు ఈ పదవి ఎవరికి దక్కుతుందని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లోని నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు (MP Raghu Ramakrishna Raju) అధికార వైసీపీకి గుడ్‌బై చెప్పారు. పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తూ సీఎం జగన్ మోహన్ రెడ్డికి లేఖ రాశారు. పార్టీ అధిష్ఠానంపై అసంతృప్తితో ఉన్న ఆయన గత రెండేండ్లుగా పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నారు.
బందర్ వైసీపీ ఎంపీ వల్లభనేని బాలశౌరి (Vallabhaneni Balashauri).. ఎవరు ఊహించని విధంగా వైసీపీకి రాజీనామా ( Resignation) చేసి జనసేనలోకి జంప్ అయ్యారు. అధికార పార్టీ ఎంపి ఏకంగా.. ఒక్క ఎమ్మెల్యే (MLA) సీటు కూడా లేని పార్టీలో చేరడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.
వైసీపీలో అంబటి రాయుడు ఎపిసోడ్ హాట్ టాపిక్‌గా మారింది. చాలా కాలం నుంచి వైసీపీకి మద్దతుగా మాట్లాడుతున్న అంబటి రీసెంట్‌గానే అధికారికంగా వైసీపీ కండువా కప్పుడుకున్నాడు. కానీ వారం కూడా తిరగకుండానే పార్టీకి రాజీనామా చేశాడు. ఎందుకు రాజీనామా చేస్తున్నాడో ఎలాంటి కారణం చెప్పలేదు. కొంత కాలం రాజకీయాలకు బ్రేక్ ఇస్తున్నానంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దీంతో అనేక చర్చలు తెరమీదకు వచ్చాయి.
వైసీపీకి, ఆ పార్టీ అధినేత జగన్‌కు షాక్‌ల మీద షాక్‌లు తగులుతున్నాయ్. నియోజకవర్గాల మార్పు, సిట్టింగ్‌లకు టికెట్ల నిరాకరణతో.. ఇక తమకు అవకాశం లేదు అనుకున్న నేతలు.. ఒకరి తర్వాత ఒకరు ఎవరి దారి వారు చూసుకుంటున్నారు. ఆళ్లతో మొదలైన రచ్చ.. కంటిన్యూ అవుతూనే ఉంది. ఇప్పుడు విశాఖ వైసీపీలో కలకలం చెలరేగింది. దాడి వీరభద్రరావు ఫ్యామిలీ.. వైసీపీకి దూరం కానుంది.
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తరువాత పాలనలో అధికారుల్లో చాలా మార్పులు జరుగుతున్నాయి. కొందరు ట్రాన్స్ఫర్ల మీద వెళ్తుంటే కొందరు మాత్రం ఏకంగా రాజీనామా చేస్తున్నారు. చేస్తున్నారు అనడం కంటే.. సీఎం రేవంత్ రెడ్డి వాళ్లను పీకి పడేస్తున్నారు అనడం కరెక్ట్‌గా ఉంటుంది. గత ప్రభుత్వంలో అధికారాన్ని మించి కేసీఆర్ కోసం పనిచేసిన అందరు అధికారులు వరుసగా పదవులకు రాజీనామా చేయాల్సి వస్తోంది. ఇదే క్రమంలో యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయ ఈవో.. గీతారెడ్డి తన పదవికి రాజీనామా చేశారు.
ప్రభుత్వం మారిన ప్రతీసారి.. వ్యవస్థలో మార్పులు ఖాయం. ఎవరు ఒప్పుకున్నా.. ఒప్పుకోకపోయినా.. ఇదే నిజం. ఇప్పుడు తెలంగాణలో ఇదే జరగబోతుందా అంటే.. ఇప్పటికిప్పుడు సమాధానం చెప్పలేకపోయినా.. కుర్చీలు మాత్రం మారిపోతున్నాయ్. బీఆర్ఎస్ ఓడిపోయి.. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత.. కీలక వ్యక్తి తన పదవికి రాజీనామా చేశారు.
తెలంగాణలో ఎన్నికల (Telangana Elections) వేళ బీజేపీ (BJP) కి పెద్ద షాక్ తగిలింది. ఆ పార్టీ కీలక నేత విజయశాంతి పార్టీకి రాజీనామా చేశారు. తన రాజీనామాను కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ (BJP State President) అధ్యక్షుడు కిషన్ రెడ్డి (Kishan Reddy) కి పంపారు. కొంతకాలంగా పార్టీలో ప్రాధాన్యత తగ్గిన కారణంగా విజయశాంతి పార్టీకి రాజీనామా చేసినట్లు తెలుస్తోంది.
జగన్‌ను ఓడిస్తాం.. అధికారంలోకి వస్తాం అని పదేపదే చెప్తూ.. పట్టుదలతో జనాల్లోకి వెళ్తున్నారు జనసేనాని పవన్ కల్యాణ్. వారాహి యాత్రతో తన దూకుడు ఏంటో చూపిస్తున్నారు. అటు టీడీపీతోనూ పొత్తు పెట్టుకున్న పవన్.. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనిచ్చేది లేదని అంటున్నారు. ఇలాంటి సమయంలో జనసేనకు రెండు భారీ షాక్‌లు తగిలాయ్.
బీఆర్ఎస్కు ఆ పార్టీ ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి రాజీనామా చేశారు. నాగర్ కర్నూల్ జిల్లా పరిషత్ వైఎస్ చైర్మెన్ బాలాజీసింగ్ కూడా కారు పార్టీకి బైబై చెప్పేశారు.