Home » Tag » Revanta Reddy
అనుముల రేవంత్ రెడ్డి.. తెలంగాణలో పదేళ్ళుగా అధికారానికి దూరమైన కాంగ్రెస్ ను పవర్ లోకి తెచ్చిన ఘనత ఆయన సొంతం. తెలంగాణలో కాంగ్రెస్ గెలవడం.. సీఎల్పీ నేతగా ఎన్నికవడంతో.. రేవంత్ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయబోతున్నారు. అట్టడుగున ఉన్న పార్టీకి జీవం నింపి.. ఫైర్ రగిల్చి.. ఇప్పుడు అధికారంలోకి తీసుకొచ్చేదాకా ఆయనదే కీలకపాత్ర. అందుకే రేవంత్ సేవలను గుర్తించిన అధిష్టానం తెలంగాణ ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోబెట్టేందుకు అనుమతి ఇచ్చింది.
తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. కానీ సర్కార్ ముందు ఎన్నో సవాళ్ళు రెడీగా ఉన్నాయి. ఆ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారంటీలు, ఇతర పథకాలను అమలు చేయడానికి ఆర్థికంగా ఇబ్బందులు తప్పవు. ఈ పథకాల అమలుకు 75 వేల కోట్ల అవసరం ఎకనమికల్ ఎక్స్ పర్ట్స్ చెబుతున్నారు. వీటికి తోడు ఇప్పటికే బీఆర్ఎస్ సర్కార్ చేసిన 5 లక్షల కోట్ల అప్పులు... లక్ష కోట్ల కాళేశ్వరం బ్యారేజీ పనులు.. ఇవన్నీ ఎలా తట్టుకుంటుంది అన్నది ప్రశ్నార్థకంగా మారింది.