Home » Tag » Revanth Reddy CM
తెలంగాణలో ప్రభుత్వం మారిపోవడంతో.. రాజకీయ సమీకరణాలు కూడా మారిపోతున్నాయి. ఒకప్పుడు ఉప్పూ – నిప్పూలాగా ఉండే పార్టీలు ఇప్పుడు ఫ్రెండ్స్ అయిపోతున్నాయి. మొన్నటిదాకా BRS తో ఫ్రెండ్షిప్ చేసిన MIM ఇప్పుడు కాంగ్రెస్ తో దోస్తీకి సిద్ధమైనట్టు తెలుస్తోంది. ఉమ్మడి ఏపీలో కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం ఉన్నప్పటి నుంచీ MIM-కాంగ్రెస్ మధ్య వార్ నడుస్తోంది. తెలంగాణ వచ్చాక పదేళ్ళ పాటు BRS అధికారంలో ఉండటంతో.. ఆ పార్టీతో దోస్తీ చేసింది MIM. ఒకానొక దశలో BRS కారు స్టీరింగ్ ఓవైసీ బ్రదర్స్ చేతుల్లో ఉన్నాయన్న విమర్శలు కూడా వచ్చాయి. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం రావడంతో.. MIM దగ్గరవుతున్నట్టు తెలుస్తోంది.
తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గా గడ్డం ప్రసాద్ కుమార్ ను కాంగ్రెస్ అధిష్టానం ఫైనల్ చేసింది. వికారాబాద్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు ప్రసాద్ కుమార్. ఈయన స్వగ్రామం తాండూర్ మండలం బెల్కటూర్. గతంలో టెక్స్టైల్ శాఖ మంత్రిగా పని చేశారు. ప్రసాద్ కుమార్ తెలంగాణ ఉద్యమం జరుగుతున్నప్పుడు.. 2008లో జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి టీడీపీ అభ్యర్థి బి. సంజీవరావుపై గెలిచారు.
రెండు టర్ములు బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని చూసిన తరువాత తెలంగాణ సమాజం మార్పు కోరుకుంది. ఆ కోరిక రీసెంట్ ఎలక్షన్లో చాలా క్లియర్గా కనిపించింది. ఇక పని అయిపోయింది అనుకున్న కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో కంబ్యాక్ తీసుకుంది. అది మామూలు కంబ్యాక్ కూడా కాదు. అధికార పార్టీని పడగొట్టి ఏకంగా 64 సీట్లలో గెలిచేంత కంబ్యాక్. ఇది మామూలు విషయం కాదు. తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ను మామూలుగా ఆధరించలేదు. ప్రజలు మార్పు కోరుకున్నా.. కాంగ్రెస్ పార్టీని నమ్మి అధికారం అప్పగించినా.. కాంగ్రెస్లో మాత్రం ఇప్పటికీ మార్పు రానట్టు కనిపిస్తోంది. ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచి రెండ్రోజులయ్యింది.
చిట్టచివరికి ఎగ్జిట్ పోల్సే నిజమయ్యాయి. తెలంగాణ రాష్ట్రం కాంగ్రెస్ హస్తగతమైంది. కొత్త ప్రభుత్వాన్ని కాంగ్రెస్ ఏర్పాటు చేయబోతోంది. హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో కాంగ్రెస్ సీఎం, మంత్రులు ప్రమాణస్వీకారం చేసేందుకు ఏర్పాట్లు కూడా ప్రారంభించినట్టు తెలుస్తోంది. ఈమేరకు కాంగ్రస్ పార్టీ ఏర్పాట్లు కూడా చేస్తోంది. ఇక కాంగ్రెస్లో ఎవరెవరికి మంత్రి పదవులు దక్కబోతున్నాయి అనే విషయం ఇప్పుడు ఇంట్రెస్టింగ్ మారింది.