Home » Tag » Rishab Pant
సిడ్నీ టెస్ట్ రెండోరోజు ఆటలో వికెట్ కీపర్ రిషబ్ పంత్ బ్యాటింగ్ హైలెట్ గా నిలిచింది. టీ ట్వంటీ తరహాలో ఆడిన పంత్ ఆసీస్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. ఈ క్రమంలో కేవలం 29 బంతుల్లోనే హాఫ్ సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు.
భారత క్రికెట్ లో రిషబ్ పంత్ ది డిఫరెంట్ స్టైల్ బ్యాటింగ్... ఎలాంటి పరిస్థితుల్లోనైనా దూకుడుగా ఆడుతూ అది కూడా ఫీల్డర్లను కన్ఫ్యూజ్ చేస్తూ కొన్ని షాట్లు ఆడుతుంటాడు. బౌలర్లపై ఆధిపత్యం కనబరుస్తూ షాట్లు కొడుతుంటాడు.
ఆస్ట్రేలియా టూర్ లో భారత బ్యాటర్ల వైఫల్యం కొనసాగుతోంది. సిరీస్ సమం చేయాలంటే తప్పనిసరిగా గెలవాల్సిన చివరి టెస్టులోనూ మన బ్యాటర్లు నిరాశపరిచారు. తొలి ఇన్నింగ్స్ లో 185 పరుగులకే ఆలౌటైన భారత్.. రెండో ఇన్నింగ్స్ లోనూ తడబడింది.
సిడ్నీ టెస్టులో రిషబ్ పంత్ ఒంటరి పోరాటం చేశాడు. ఒకవైపు వికెట్లు పడుతున్నా కీలక ఇన్నింగ్స్ ఆడాడు. ఆసీస్ బౌలర్లు బౌన్సర్లతో గాయపరిచినా నిలకడగా ఆడి 40 రన్స్ చేశాడు.
ఆస్ట్రేలియాతో సిడ్నీ వేదికగా జరుగుతున్న చివరి టెస్టులో భారత బ్యాటర్ రిషబ్ పంత్ పోరాటం ఆకట్టుకుంది. ఆస్ట్రేలియా బౌలర్లు బాడీలైన్ బంతులతో ఇబ్బంది పెట్టినా.. ధైర్యంగా ఎదుర్కొన్నాడు.
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో చివరి మ్యాచ్ కోసం భారత్ రెడీ అయింది. బాక్సింగ్ డే టెస్టును డ్రా చేసుకునే అవకాశం ఉన్నా అనూహ్యంగా పరాజయం పాలైన టీమిండియా సిరీస్ లో 1-2తో వెనుకబడింది.
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భారత్ కు మరో ఓటమి ఎదురైంది. ఖచ్చితంగా డ్రా చేస్తారనుకున్న మ్యాచ్ ను చేజేతులారా ఓడిపోయింది. మళ్ళీ బ్యాటర్లు అట్టర్ ఫ్లాప్ అవ్వడంతో పరాజయం పాలైంది. ఒకవిధంగా ఈ ఓటమి అనూహ్యమనే చెప్పాలి.
టీమిండియా వికెట్ కీపర్ రిషబ్ పంత్ పై భారత మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ ఓ రేంజ్ లో ఫైర్ అయ్యాడు. మెల్ బోర్న్ టెస్టులో పంత్ ఔటైన విధానంతో గవాస్కర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. స్టుపిడ్ లా ఆడావంటూ మండిపడ్డాడు. ఒక చెత్త షాట్ అంటూ తిట్టిపోశాడు.
పింక్ బాల్ టెస్టులో ఘోరపరాజయం పాలైన టీమిండియా ప్రస్తుతం మూడో టెస్టుకు సన్నద్ధమవుతోంది. సిరీస్ సమంగా ఉన్న నేపథ్యంలో ఆధిక్యం పెంచుకునేందుకు ఇరు జట్లు పట్టుదలగా ఉన్నాయి. ఇప్పటికే భారత్ ప్రాక్టీస్ లో బిజీగా గడుపుతోంది.
ఆస్ట్రేలియా టూర్ లో రెండో సవాల్ కు భారత్ రెడీ అవుతోంది. అడిలైడ్ వేదికగా డిసెంబర్ 6 నుంచి డే అండ్ నైట్ టెస్ట్ మ్యాచ్ ఆడబోతోంది. ఈ పింక్ బాల్ టెస్ట్ కోసం భారత తుది జట్టులో పలు మార్పులు ఖాయమయ్యాయి.