Home » Tag » Rohith Sharma
టెస్టుల్లో టీమిండియా వరుస వైఫల్యాల నేపథ్యంలో బీసీసీఐ కీలక నిర్ణయాలు తీసుకోబోతోంది. ఆటగాళ్ళ స్వేఛ్ఛపై ఆంక్షలు విధించేందుకు సిద్ధమవుతోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా క్రికెటర్ల ఫ్యామిలీ టూర్లకు సంబంధించి కండీషన్లు పెట్టబోతున్నట్టు సమాచారం.
ఎంత పెద్ద క్రికెటర్ అయినా కొన్నిసార్లు గడ్డుకాలాన్ని ఎదుర్కొంటాడు... కపిల్ దేవ్ , కుంబ్లే, సచిన్ లాంటి దిగ్గజ ఆటగాళ్ళు కూడా పేలవమైన ఫామ్ తో నిరాశపరిచిన సందర్భాలు చాలానే ఉన్నాయి... ఫామ్ కోసం తంటాలు పడి మళ్ళీ కమ్ బ్యాక్ ఇచ్చిన పరిస్థితులూ ఉన్నాయి...
ఆస్ట్రేలియా టూర్ జరుగుతుండగానే కాదు ముగిసిన తర్వాత కూడా రోహిత్ , విరాట్ కోహ్లీ రిటైర్మెంట్ పై పెద్ద చర్చే జరిగింది. రోహిత్ తాను రిటైర్ కావడం లేదంటూ క్లారిటీ ఇవ్వగా కోహ్లీ మాత్రం స్పందించలేదు.
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ సమయంలో రోహిత్ శర్మ రిటైర్మెంట్ గురించి పెద్ద చర్చే జరిగింది. దాదాపు ఏడాదికి పైగా పేలవ ఫామ్ లో ఉన్న హిట్ మ్యాన్ ఇక టెస్ట్ ఫార్మాట్ కు గుడ్ బై చెప్పే టైమ్ వచ్చిందన్న అభిప్రాయం గట్టిగానే వినిపించింది.
పేలవమైన ఫామ్ తో సతమతమవుతున్న భారత స్టార్ క్రికెటర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్ లో దిగజారారు. తాజాగా విడుదలైన జాబితాలో వీరిద్దరూ తమ కరీర్ లోనే అత్యంత చెత్త స్థానాల్లో నిలిచారు.
ఆస్ట్రేలియా టూర్ లో ఈ సారి టీమిండియాకు ఊహించని పరాభవం ఎదురైంది. కంగారూ గడ్డపై ఫేవరెట్ గా అడుగుపెట్టిన భారత్ చెత్త ప్రదర్శనతో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని చేజార్చుకుంది. తొలి టెస్ట్ గెలిచినా తర్వాత చేతులెత్తేసింది.
ఆస్ట్రేలియా పర్యటనలో రోహిత్ తేలిపోయాడు. కెప్టెన్ గా నిర్ణయాలు తీసుకోవడంలో విఫలమైన హిట్ మ్యాన్, బ్యాటర్ గానూ నిరాశపరిచాడు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో రోహిత్ శర్మ ఆడిన 3 మ్యాచ్ల్లో కేవలం 31 పరుగులు మాత్రమే చేయగలిగాడు.
మూడోసారి బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ గెలిచి హ్యాట్రిక్ కొట్టాలనుకున్న టీమిండియా కల నెరవేరలేదు. అంచనాలు పెట్టుకున్న బ్యాటర్లందరూ అట్టర్ ఫ్లాప్ అవ్వడమే దీనికి ప్రధాన కారణం. రోహిత్ , కోహ్లీ, రాహుల్, గిల్ , పంత్ ఇలా ఒక్కరు కూడా రాణించలేదు.
ఆస్ట్రేలియా గడ్డపై భారత్ ఆధిపత్యానికి తెరపడింది. వరుసగా మూడోసారి బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ గెలవాలన్న ఆశలు బాక్సింగ్ డే టెస్టుతోనూ ముగిసిపోాగా.. కనీసం సిరీస్ ను సమం చేయాలన్న లక్ష్యం కూడా నెరవేరలేదు.
ఆస్ట్రేలియా పర్యటనలో ఈ సారి సీనియర్ ప్లేయర్స్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ గురించి జరిగినంత చర్చ మరెవరి గురించీ జరగలేదు. వీరిద్దరూ స్థాయికి తగినట్టు ఆడకపోవడంతో విమర్శలు వచ్చాయి.