Home » Tag » Rs 2000 Notes
ఇంకా ఎవరి దగ్గరయినా 2వేల రూపాయల నోట్లు ఉంటే వెంటనే బ్యాంకులో మార్చుకోవడం బెటర్. ఇందుకోసం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) పెట్టిన సెప్టెంబరు 30 డెడ్ లైన్ ముంచుకొస్తోంది.
వారం రోజుల్లోనే రూ.36 వేల కోట్ల విలువైన రూ.2 వేల నోట్లు వచ్చి చేరినట్లు అంచనా. డిపాజిట్లు లేదా మార్పిడి పేరుతో నోట్లు బ్యాంకులకు చేరాయి. ఆర్బీఐ సమాచారం ప్రకారం.. గత నెల 26 నాటికి దేశంలో మొత్తం రూ.34.4 లక్షల కరెన్సీ చెలామణిలో ఉంది.
నగదు డబ్బుతో బంగారం కొనాలంటే కొన్ని పరిమితులు ఉన్నాయి. గరిష్టంగా రూ.2 లక్షల వరకు మాత్రమే నగదుతో చెల్లింపులు చేయొచ్చు. రూ.2 లక్షల వరకు క్యాష్ ఇచ్చి బంగారం కొనొచ్చు. దీంతో చాలా మంది తమ దగ్గరున్న రెండు వేల రూపాయల నోట్లను చెల్లించి, రెండు లక్షల వరకు విలువైన బంగారం కొంటున్నారు.
నోట్ల ఉపసంహరణ నిర్ణయం వెలువడ్డ తర్వాత నుంచి జువెలరీ షాపులకు 20 శాతం గిరాకీ పెరిగిందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. మొన్నటివరకు ఇంట్లో చాలా మంది రూ.2 వేల నోట్లను దాచుకున్నారు.
చాలా మంది తమ దగ్గరున్న నోట్లను మార్చుకునేందుకు బ్యాంకులకు క్యూ కడుతున్నారు. అర్జెంటుగా నోట్లు మార్చుకోకపోతే ఇబ్బందుల్లో పడతామేమో అని కంగారు పడుతున్నారు. నిజానికి అంత కంగారు అవసరం లేదంటున్నారు ఆర్థిక నిపుణులు.
రూ.2,000 నోటు నిర్ణయం తర్వాతి రోజే కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ఆ డెసిషన్ని విమర్శించారు. పలువురు ఆర్థికవేత్తలు కూడా నోటికి పని చెప్పారు. అయినా వెనక్కి తగ్గలేదు మోదీ. ఎందుకంటే ఆయన్ను అప్పుడు విమర్శించిన వాళ్లకంటే మద్దతిచ్చిన వాళ్లే ఎక్కువున్నారు.
రూ.2వేల నోట్ల రద్దు నిర్ణయం ఎందుకు తీసుకున్నారు.. దానివల్ల ఆర్థిక వ్యవస్థపై ప్రభావమెంత అన్నది పక్కన పెడితే పొలిటికల్ పార్టీలకు మాత్రం మోదీ గట్టి షాకే ఇచ్చారు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల సీఎంలకు మాత్రం దిమ్మతిరిగిపోయేలా దెబ్బ కొట్టారు. ఎన్నికల కోసం కట్టల గుట్టలు సిద్ధం చేసుకున్న నేతలు ఇప్పుడు తలపట్టుకుంటున్నారు.
రూ.2 వేల నోట్లను రద్దు చేయాలని నిర్ణయించినా ఇప్పటికిప్పుడు వచ్చిన సమస్యేమీ లేదు. సెప్టెంబర్ 30 వరకు ఈ నోట్లు చెల్లుబాటు అవుతాయి. గతంలోలాగే రూ.2 వేల నోట్లను నిరభ్యంతరంగా వాడుకోవచ్చు. అంటే రోజువారీ అవసరాల కోసం నోట్లను ఇవ్వడం, తీసుకోవడం చేయొచ్చు.