Home » Tag » RS Praveen kumar
బీఆర్ఎస్ నేత ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్ కీలక వ్యాఖ్యలు చేసారు. 28మంది గురుకుల విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారని గురుకులాల్లో ఉన్న సమస్యలపై అధ్యయనం చేసి రిపోర్ట్ ఇస్తామన్నారు.
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో అరెస్ట్ అయి తీహార్ జైల్లో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితతో బీఆర్ఎస్ నాయకలు మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కవితతో ములాఖత్ అయ్యారు.
లోక్ సభ ఎన్నికల (Lok Sabha Elections) నేపథ్యంలో ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ (BRS) పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో ఊపందుకోంటుంది.
ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. ప్రవీణ్‌కు షాక్‌ల మీద షాక్‌లు తగులుతున్నాయ్. ఆర్ఎస్పీ అభ్యర్థిత్వాన్ని ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా గులాబీ నేతలు తీవ్రంగా వ్యతిరేకిస్తుండగా.. సొంత తమ్ముడు ఆర్ఎస్ ప్రసన్నకుమార్ నుంచే ఇప్పుడు ప్రవీణ్ కుమార్‌కు షాక్ తగిలే అవకాశాలు కనిపిస్తున్నాయ్.
ఇరు పార్టీలు పోటీ చేసే స్థానాలపై క్లారిటీ వచ్చింది. ఒప్పందం ప్రకారం.. బీఎస్పీ రెండు స్తానాల్లో పోటీ చేయనుంది. బీఆర్ఎస్ 15 స్థానాల్లో పోటీ చేస్తుంది. దీనిలో భాగంగా బీఎస్పీ హైదరాబాద్, నాగర్‌కర్నూల్ స్థానాల నుంచి పోటీ చేస్తుంది.
అధికారాంతమున చూడవలె అయ్యవారి వైభవం అంటారు. అధికారం పోగొట్టుకున్న తర్వాత కేసీఆర్ (KCR) వైభవం ఎలా దిగజారిపోయిందో స్పష్టంగా బయటపడింది. BRS ఇప్పుడు బీఎస్పీ పొత్తు పెట్టుకోవడంపై అందరూ ఆశ్చర్యపోతున్నారు.
తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ను బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు మాజీ ఐపీఎస్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కాసేపటి క్రితమే బంజారాహిల్స్‌లోని నందినగర్ లోని కేసీఆర్ నివాసం మర్యాదపూర్వకంగా కలిశారు. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ సమావేశంలో హరీశ్‌రావు, వేముల ప్రశాంత్ రెడ్డి, బాల్క సుమాన్‌తో పాటు పలువురు ప్రతినిధులు పాల్గొన్నారు.
ప్రభుత్వ వ్యతిరేక ఓటర్లలో చాలామంది కాంగ్రెస్ వైపే ఉన్నా.. బీఎస్పీ కూడా కొన్ని వర్గాల ఓట్లు చీల్చుకుంటోంది. రాష్ట్రంలో దళిత ఓటు బ్యాంక్‌నే చీలిక వచ్చే ఛాన్సుందని పరిశీలకులు చెబుతున్నారు. ఇలా ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలడం వల్ల.. అది పరోక్షంగా అధికారపార్టీ బీఆర్ఎస్కు కలిసొచ్చే అవకాశముంది.
3 కోట్ల బహుజన బిడ్డలు డబ్బులు ఇచ్చి మన రాజ్యం రావాలి కొట్లాడంది అంటున్నారు. వేములవాడలో ఆ దొర పోతే ఈ దొరలు వస్తున్నారు. బీసీ బిడ్డలపై దొరలు కుట్రలు చేస్తున్నారు. వట్టే జానయ్యపై దాడి చేశారు. బాబా సాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం ప్రకారం అందరు బహుజన బిడ్డలు ఏకం కావాలి.
తెలంగాణ ఎన్నికల్లో ప్రధాన పార్టీలు అయిన బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ పార్టీలు ఇప్పటికే తమ అభ్యర్థులను ప్రకటించాయి. ఇక మరో పార్టీ పార్టీ అయిన బీఎస్పీ పార్టీ ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా 99 అభ్యర్ధులను ప్రకటించింది. కాగా ఇవాళ మరో 20 మంది అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. ఆ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అభ్యర్థుల జాబితాను విడుదల చేశారు. ఇక కాంగ్రెస్ నుంచి టికెట్ పొంది.. చివరి క్షణంలో టికెట్ కోల్పొయిన పటాన్ చెరు అభ్యర్థి నీలం మధు.. బీఎస్పీ పార్టీలో చేరి తెలంగాణ రాష్ట్ర ఉప అధ్యక్షుడు దయానంద్ చేతుల మీదుగా.. బీ ఫార్మ అందుకున్న నీలం మధు ముదిరాజ్.