Home » Tag » Rythu Bandhu
తెలంగాణలో రైతులు ఎదర్కొంటున్న సమస్యలపై నేడు రాష్ట్రవ్యాప్తంగా నియోజకవర్గ కేంద్రాల్లో BRS నిరసన కార్యక్రమాలు చేపట్టింది.
తెలంగాణలో కొలువుదీరిన కాంగ్రెస్ ప్రభుత్వం.. ఎన్నికల హామీల అమలుపై కసరత్తు మొదలుపెట్టింది. మరికొన్ని నెలల్లో లోక్‌సభ ఎన్నికలు జరగబోతుండగా.. ఆరు గ్యారెంటీల్లో ఇచ్చిన హామీలను జనాల దగ్గరకు చేరవేసేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఆరు గ్యారెంటీల్లో (Six Guarantees) రెండు గ్యారెంటీలు అయిన.. మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం, ఆరోగ్య శ్రీ కార్డు పరిమితి పెంపు అమలు చేసింది.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కొంతమందికి రైతుబంధు సాయం డబ్బు అకౌంట్లలో పడింది. ఇంకొందరికి పడలేదు. దీంతో చాలామంది ఎదురు చూస్తున్నారు. ఐతే రైతుబంధుపై ఎవరూ కూడా ఎలాంటి అపోహలు పెట్టుకోవద్దని తుమ్మల సూచించారు.
తెలంగాణలో ప్రస్తుతం అందుతున్న రైతు బంధు సాయంలో మార్పులు చేయాలని రేవంత్ రెడ్డి సర్కార్ భావిస్తోంది. రైతు భరోసా పేరుతో వచ్చే కొత్త పథకం కోసం లేటెస్ట్ గా గైడ్ లైన్స్ రూపొందిస్తోంది. కొన్ని భూములకు రైతు బంధు సాయం చేయరాదని నిర్ణయించినట్టు తెలుస్తోంది. సాగులో ఉన్న భూములకే ప్రాధాన్యత ఇవ్వబోతోంది. దీంతో పాటు రైతు బంధు సాయంలో అనేక మార్పులు ఉండబోతున్నాయి.
గతంలో మాదిరిగా రైతులకు ఈ చెల్లింపులు చేయాలని అధికారులను ఆదేశించారు. నిజానికి ఇప్పటికే రైతు బంధు నిధులు విడుదల చేయాలి. కానీ, ఎన్నికల కోడ్ అమలులో ఉండటంతో గత ప్రభుత్వం నిధులు విడుదల చేయలేదు.
తెలంగాణ అసెంబ్లీ సమరం నువ్వా నేనా అన్నట్లుగా సాగుతోంది. మూడు ప్రధాన పార్టీల మధ్య పోటీ ఉన్నా.. బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య టఫ్ ఫైట్ నడుస్తోంది. పోలింగ్‌కు ఇంకొన్ని గంటల సమయం ఉన్న వేళ.. ఇప్పుడు తెలంగాణ రాజకీయం రైతు బంధు చుట్టూ తిరుగుతోంది.
నాడు అధికారంలో ఉండీ కాంగ్రెస్ రైతులను గోస పెట్టింది. నేడు ప్రతిపక్షంలో ఉండి కూడా గోస పెడుతున్నది. వ్యవసాయం దండగ అన్నొడికి వారసుడు రేవంత్. మూడు గంటల కరెంట్ చాలు అన్నడు. అక్టోబర్ 23న మానిక్ రావు ఠాక్రే.. రైతు బంధు వేయొధ్దు అని ఎన్నికల కమిషన్‌కు పిర్యాదు చేశారు.
హరీష్ రావు వ్యాఖ్యలు, కేసీఆర్ అతి తెలివి వల్ల రైతు బంధు ఆగింది. రైతుల ఖాతాల్లో పడాల్సిన రూ.5 వేల కోట్లు ఆగిపోయాయి. రైతులకు విజ్ఞప్తి చేస్తున్నా. రైతు బంధు రాకపోవడానికి కారణమైన బీఆరెస్ నేతలను తరిమికొట్టండి. బీఆరెస్ కుట్ర వల్లే రైతుల ఖాతాలో పడాల్సిన నిధులు ఆగిపోయాయి.
రైతు బంధు ఆగిపోవడానికి కాంగ్రెస్ పార్టీ రాసిన లేఖలే కారణం అని బీఆర్ఎస్ ఆరోపిస్తుంటే.. హరీష్ రావు నోటి దూలవల్లే రైతు బంధును ఈసీ నిలిపివేసిందని కాంగ్రెస్ అంటోంది. ఇక.. కాంగ్రెస్ పేరుతో ఫేక్ లెటర్ సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతోంది.
అనుకున్నంతా అయింది.. కావాలని చేశాడో.. అనుకోకుండా చేసాడో హరీష్ రావు కేసీఆర్ కొంప ముంచాడు. రైతుబంధు నిధుల విడుదలపై హరీష్ రావు ప్రదర్శించిన అత్యుత్సాహం వల్ల.. ఇప్పుడు ఈసీ ఆ స్కీమ్ నిలిపివేస్తూ ఆదేశాలిచ్చింది. హరీష్ ఎన్నికల ప్రచార సభల్లో ప్రస్తావించడం వల్లే రైతుబంధు విడుదల అనుమతిని వెనక్కి తీసుకున్నట్టు కేంద్ర ఎన్నికల కమిషన్ తన ఆదేశాల్లో స్పష్టంగా పేర్కొంది. దాంతో చివరి నిమిషంలో ఓటర్లను ఆకట్టుకోడానికి సీఎం కేసీఆర్ చేసిన ప్రయత్నం బెడిసికొట్టింది. బీఆర్ఎస్ తన కన్ను తానే పొడుచుకున్నట్టు అయింది.