Home » Tag » Sabitha Indra Reddy
తెలంగాణలో అధికార మార్పిడి జరిగింది. ఇదే సమయంలో.. మాజీ మంత్రుల ఆఫీసుల్లో ఫైల్స్ మిస్సింగ్, ఫర్నిచర్ తరలింపు ఘటనలు దుమారం రేపుతున్నాయి. హైదరాబాద్లో ఒకే రోజు రెండు కేసులు నమోదు కావడం కలకలం రేపుతోంది. మరోవైపు.. సీఎంవోలో ఫేక్ ప్రొటోకాల్ ఆఫీసర్గా చలామణి అవుతున్న కేటుగాడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
పోటీ చేస్తే అపజయం ఎరుగని నేతగా సబితకు రికార్డు ఉంది. మొన్నటి ఎన్నికల్లో కూడా మహేశ్వరం నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసిన సబితా ఇంద్రారెడ్డి.. మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు. ఆమె తన సమీప ప్రత్యర్థి, బీజేపీ నేత అందెల శ్రీరాములు యాదవ్పై 26,187 ఓట్ల తేడాతో గెలిచారు.
పలువురు రాజకీయ నేతలు, వారి సన్నిహితుల ఇండ్లు, కార్యాలయాలపై ఐటీ దాడులు జరుగుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం తెలంగాణ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అనుచరులపై దాడులు జరిగాయి. మంత్రి సబితా ఇంద్రారెడ్డి దగ్గరి బంధువు అయిన ప్రదీప్ రెడ్డి ఇంట్లో ఐటీ అధికారులు సోదాలు చేశారు.
తెలంగాణ ఎన్నికల వేళ మరోసారి హైదరాబాద్ లో ఐటీ రైడ్స్ కలకలం రేపుతున్నాయి. తెలంగాణ ఎన్నికల పోలింగ్ మరో 17 రోజులు మాత్రమే సమయం ఉంది. సోమవారం తెల్లవారుజాము నుంచి హైదరాబాద్ లోని 15 చోట్ల ఏకకాలంలో ఐటీ అధికారులు తనిఖీలు చేపట్టారు.
మంత్రి సబితా ఇంద్రారెడ్డి గురువారం మీడియాతో మాట్లాడారు. 6,500 పోస్టులకుపైగా భర్తీకి డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు తెలిపారు. పాఠశాల విద్యలో మొత్తం 5,089 పోస్టులు, ప్రత్యేక విద్యార్థుల పాఠశాలల్లో 1523 పోస్టుల భర్తీ చేయనున్నట్లు పేర్కొన్నారు.
మహేశ్వరం నియోజకవర్గంలో రెండు బీఆర్ఎస్ వర్గాలు ఏర్పడ్డాయి. అయితే, ఇందులో సబిత వర్గానిదే ఆధిపత్యం. ఆమెకు మంత్రి పదవి ఉండటం, కేసీఆర్ అండదండలు ఉండటంతో సబిత ఆధిపత్యం కొనసాగింది.
తెలంగాణలో బోనాల మహోత్సవాలు అంబరాన్ని అంటుతున్నాయి
హిమాన్షును ఇంటర్వ్యూ చేసేందుకు చానెల్స్ కూడా పోటీ పడుతున్నాయంటే.. అర్థం చేసుకోవచ్చు మనోడి క్రేజ్. ఇదంతా ఎలా ఉన్నా.. హిమాన్షు చేసి మంచి పని.. ఇప్పుడు కేసీఆర్ టార్గెట్ అయ్యేలా చేస్తోంది.
గౌలిదొడ్డి కేశవనగర్లోని మండల పరిషత్ ప్రభుత్వ పాఠశాలకు హిమాన్షు నిధులు సేకరించి ఇచ్చాడు. దీంతో పాఠశాలను నెల రోజుల్లోనే అభివృద్ధి చేశారు. ఈ పాఠశాలను హిమాన్షు పుట్టిన రోజైన జూలై 12న తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రారంభించబోతున్నారు.