Home » Tag » Sachin Pilot
తెలంగాణ ఎన్నికల వేళ మళ్లీ తెరపైకి రైతు బంధు పథకం.. ఇటీవల రైతు బంధు పథకం నిధుల విడుదలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ఎన్నకల సంఘం. తాజాగా అందిన ఫిర్యాదుల మేరకు ఉన్న పలంగా రైతు బంధు పంపిణీ ని ఆపాలని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. రైతు బంధు నిధులను ప్రస్తుతం విడుదల చేయవద్దని.. రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది.
రాజస్థాన్ ఎమ్మెల్యే ,ఏఐసీసీ జాతీయ నాయకులు.. సచిన్ పైలట్ తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ కు ఓటు వేయ్యాలని విజ్ఞప్తి చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది. కాంగ్రెస్ పై ప్రజల్లో మంచి స్పందన ఉంది. రాహుల్ గాంధీ, ఖర్గే ,ప్రియాంకా గాంధీ ల పర్యటనకు మంచి స్పందన వస్తుంది.
రాజస్థాన్ లో ఈ సారి ఆనవాయితీ కొనసాగుతుందా..? ఐదేళ్లకొకసారి అధికారం మారే తీరుకు ఓటర్లు స్వస్తి పలకనున్నారా..? రాజస్థాన్ పూర్తి రాజకీయ ముఖచిత్రాన్ని ఇప్పుడు చూద్దాం.
సీఎం అశోక్ గెహ్లాట్, సచిన్ పైలట్ మధ్య అధిష్టానం సయోధ్య కుదిర్చినప్పటికీ, సచిన్ తనదారి తనదే అంటున్నాడు. తాజాగా సచిన్ తన నియోజకవర్గంలో పర్యటించాడు. ఈ సందర్భంగా తన పోరాటంలో రాజీ పడే ప్రసక్తే లేదని తేల్చిచెప్పాడు.
అసెంబ్లీ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో ఇరువురు నేతల మధ్య గొడవలు పార్టీకి చేటు చేస్తాయని భావించి, చక్కదిద్దారు. సోమవారం అశోక్ గెహ్లాట్, సచిన్ పైలట్‌తో ఖర్గే, రాహుల్ చర్చలు జరిపారు. ఢిల్లీలోని రాహుల్ నివాసంలో ఇద్దరిమధ్యా సయోధ్య కుదిర్చారు.
సీఎం అశోక్ గెహ్లాట్, మాజీ పీసీసీ చీఫ్ సచిన్ పైలట్ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. దీంతో వీళ్లద్దరి మధ్య సయోధ్య కుదర్చలేక కాంగ్రెస్ అధిష్టానం చేతులెత్తేస్తోంది. మరికొన్ని నెలల్లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో రాజస్థాన్‌లో నెలకొన్న ఈ సంక్షోభం ఎలాంటి మలుపులు తీసుకుంటుందోననే భయం పార్టీలో కనిపిస్తోంది.