Home » Tag » Sam Konstas
జెంటిల్మెన్ గేమ్ క్రికెట్ లో జెంటిల్మెన్ లా వ్యవహరించేది చాలా కొద్ది మంది మాత్రమే... ముఖ్యంగా ఆస్ట్రేలియా క్రికెటర్లయితే స్లెడ్జింగ్ కు కేరాఫ్ అడ్రస్... సొంతగడ్డపై ఏ జట్టుతోనైనా సిరీస్ ఆడుతున్నారంటే రెచ్చిపోతుంటారు... కానీ వారికి ధీటుగా స్పందించే విషయంలో భారత ఆటగాళ్ళు ముందుంటారు...
బాక్సింగ్ డే టెస్ట్ రసవత్తరంగా ఆరంభమయింది. తొలి రోజు ఆతిథ్య జట్టుదే పై చేయిగా నిలిచింది. 19 ఏళ్ల ఆసీస్ యువ ఓపెనర్ శాం కొంటాస్ అరంగేట్రంలోనే అదరగొట్టేశాడు. బుమ్రతో సహా భారత బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొని హాఫ్ సెంచరీ చేశాడు.
ఆస్ట్రేలియా జట్టుకు భవిష్యత్తు టెస్ట్ బ్యాట్స్‌మెన్ దొరికాడు. మెల్బోర్న్ వేదికగా భారత్‌తో జరుగుతున్న నాలుగో టెస్టు మ్యాచ్‌లో అరంగేట్రం ఆటగాడు సామ్ కాన్స్టాస్ బ్యాట్‌తో చేసిన అద్భుత ఫీట్‌ని అందరూ కొనియాడుతున్నారు.