Home » Tag » Same Sex marriage
ప్రపంచ వ్యాప్తంగా ఈ స్వలింగ సంపర్కుల వివాహం పై చాలా దేశాలు చట్టబద్ధత కల్పించాయి. వాటిలో దాదాపు 30కి పైగా దేశాల్లో ప్రస్తుతం అమలులో ఉంది. భారత దేశంలో కూడా స్వలింగ వివాహాలకు చట్టబద్ధత కల్పించే విషయంపై సుప్రీంకోర్టు గత 5 నెలల క్రితమే వాదనలు జరిపింది. 5 నెలల నుంచి సుదీర్ఘ వాదనల తరువాత తీర్పును మే 11 రిజర్వ్ చేసి ఉంచారు.
స్వలింగ వివాహాలు ప్రస్తుతం మన దేశంలో పెరగిపోతున్న నేపథ్యంలో దీనిపై వాదనలు విన్న సుప్రీం కోర్టు ఐదు నెలల తరువాత సంచలన తీర్పును వెల్లడించింది.
మేమూ మనుషులమే, మాకూ హక్కులుంటాయి అంటూ LGBTQ+ కమ్యూనిటీ న్యాయపోరాటం చేస్తోంది. స్వలింగ వివాహాలకు చట్టబద్దత కల్పించాలని, కేవలం తమకున్న సెక్సువల్ ఓరియంటేషన్ కారణంగా తమ హక్కులను హరించడం, నిరాకరించడం రాజ్యాంగ ఉల్లంఘన కిందకే వస్తుందని LGBTQ+ కమ్యూనిటీ సుప్రీంకోర్టులో వాదిస్తోంది.
దేశ వ్యాప్తంగా ఉన్న LGBTQ కమ్యూనిటీ సుప్రీంకోర్టు తీర్పు కోసం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. స్వలింగ వివాహాలకు న్యాయస్థానం ఆమోదిస్తే.. తైవాన్ తర్వాత ఆసియాలో ఈ తరహా వివాహాలను ఆమోదించిన రెండో దేశంగా భారత్ నిలుస్తుంది.