Home » Tag » sarfaraz khan
జెడ్డా వేదికగా ఐపీఎల్ వేలంలో ఈసారి 182 మంది ఆటగాళ్లు అమ్ముడుపోగా కొంతమంది స్టార్ ప్లేయర్స్ కు ఫ్రాంచైజీలు షాకిచ్చాయి. టీమిండియాలో చోటు దక్కించుకున్న యువ బ్యాటర్ సర్పరాజ్ ఖాన్ ఐపీఎల్ లో అమ్ముడుపోలేదు.సర్ఫరాజ్ ఖాన్ బేస్ ధర 75 లక్షలు మాత్రమే.
దేశవాళీ క్రికెట్ టోర్నీ ఇరానీ కప్ లో యువ క్రికెటర్ సర్ఫరాజ్ ఖాన్ దుమ్మురేపాడు. తన సూపర్ ఫామ్ కొనసాగిస్తూ డబుల్ సెంచరీతో అదరగొట్టేశాడు. రెస్టాఫ్ ఇండియాతో జరుగుతున్న మ్యాచ్‌లో ముంబై తరఫున బరిలోకి దిగిన సర్ఫరాజ్ 253 బంతుల్లో దిశ్వతకం సాధించాడు.
అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టిన సర్ఫరాజ్.. మెరుపు అర్ధ శతకం సాధించాడు. తద్వారా జట్టు విజయంలో కీలక పాత్ర పోషించి తానేంటో నిరూపించుకున్నాడు. సర్ఫరాజ్ ఖాన్‌కు తన తండ్రి నౌషద్ ఖాన్ కోచ్, మెంటార్ గా ఉన్నాడు.
ఇంగ్లండ్ టెస్టు సిరీస్‌లో రాణించిన సర్ఫరాజ్‌ను రిప్లేస్‌మెంట్‌తో దక్కించుకోవాలని ఫ్రాంచైజీలు భావిస్తున్నాయి. అయితే ఈ రేసులో అందరి కంటే ముందు గుజరాత్ టైటాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. ఆ జట్టు వికెట్ కీపర్ రాబిన్ మింజ్ బైక్ ప్రమాదంలో గాయపడి ఈ సీజన్ మొత్తానికి దూరమయ్యాడు.
మినీ వేలానికి ముందు ఢిల్లీ క్యాపిటల్స్ సర్ఫరాజ్ ఖాన్‌ను రిలీజ్ చేయగా అమ్ముడుపోకుండా మిగిలిపోయాడు. ఈ క్రమంలో అతడి సేవలను వినియోగించుకోవాలని గంభీర్ కేకేఆర్ యాజమాన్యానికి సూచించినట్లు సమాచారం.
ఇంగ్లాండ్ (England) తో మూడో టెస్టులో గ్రాండ్ విక్టరీ కొట్టి జోష్ మీదున్న టీమిండియా (Team India) కు మరో గుడ్‌న్యూస్... గాయంతో జట్టుకు దూరమైన స్టార్ బ్యాటర్ (Star Batter) కేఎల్ రాహుల్ (KL Rahul).. నాలుగో టెస్ట్‌లో బరిలోకి దిగనున్నాడు. రాంచీ వేదికగా ఫిబ్రవరి 23 నుంచి 27 వరకు ఈ టెస్ట్ మ్యాచ్ జరగనుంది.
ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్ర కూడా సర్ఫరాజ్ తండ్రి ప్రేమకు ఫిదా అయ్యాడు. అద్భుతమైన గిఫ్ట్ ఇచ్చి తన గొప్ప మనసు చాటుకున్నాడు. సర్ఫరాజ్ తండ్రి గొప్పదనం చెప్తూ.. ఎమోషనల్ ట్వీట్ చేశాడు.
మాంచి దూకుడు మీదున్నాడు. అరంగేట్రంలోనే ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ రికార్డ్ కూడా క్రియేట్ చేశాడు. సెంచరీ కూడా ఈజీగా కొట్టేస్తాడనుకునేలోపే.. రాంగ్ కాల్ రనౌట్ చేసింది. అంతే అటు గ్రౌండ్లో.. ఇటూ బయట విమర్శల వర్షం స్టార్ట్ అయింది. నెటిజన్లు, క్రికెట్ ఫ్యాన్స్ నుంచి ఓ రేంజ్లో ట్రోల్స్ రావడంతో.. నాదే తప్పు.. సారీ అనేశాడు జడేజా.
ఈ మ్యాచు ద్వారా సర్ఫరాజ్ ఖాన్ టెస్టు అరంగేట్రం చేశాడు. మొదటి మ్యాచులోనే సర్ఫరాజ్ అర్ధ సెంచరీ సాధించాడు. చాలా కాలం జాతీయ జట్టులో చోటు కోసం ఎదురుచూసిన సర్ఫరాజ్.. మొదటి మ్యాచులోనే సత్తా చాటాడు.
కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజా గాయాల కారణంగా దూరమవడంతో సర్ఫరాజ్ ఖాన్, సౌరభ్ కుమార్, వాషింగ్టన్ సుందర్‌లకు బీసీసీఐ సెలక్షన్ కమిటీ పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో దక్షిణాఫ్రికా దిగ్గజం ఏబీ డివిలియర్స్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.