Home » Tag » Seats
ఓ వైపు పొత్తులతో ఇబ్బంది పడుతుంటే.. మరోవైపు వైసీపీ నుంచి చేరికలు కూడా టీడీపీ లీడర్లలో టెన్షన్ కలిగిస్తున్నాయి. ఎన్నో యేళ్ళుగా పార్టీని నమ్ముకొని ఉన్న చాలామంది తెలుగు తమ్ముళ్ళకు ఇప్పుడు టిక్కెట్లు రావడం డౌటే అంటున్నారు.
పార్లమెంట్ ఎన్నికల్లో పార్టీ తరపున పోటీ చేయాలనుకునే వాళ్లంతా దరఖాస్తు చేసుకోవచ్చని కాంగ్రెస్ ప్రకటించడంతో ఆశావహులంతా గాంధీభవన్‌కు క్యూ కడుతున్నారు. పార్టీ సీనియర్ నేతల దగ్గర నుంచి టికెట్ ఆశిస్తున్న బయటి వ్యక్తులు కూడా అప్లయ్ చేశారు.
టీడీపీ-జనసేన మధ్య పొత్తులు కుదిరాయి. మొన్నటి వరకు పొత్తులపై క్లారిటీ రావాల్సి ఉన్న క్రమంలో సీట్లపై అప్పుడప్పుడు చర్చ జరుగుతూ ఉండేది. కానీ ఇప్పుడు పొత్తులు పూర్తి స్థాయిలో ఖరారు కావడంతో ఎవరెవరికి ఎన్నెన్ని సీట్లు.. ఏయే స్థానాలు ఎవరెవరికి దక్కుతాయనే అంశంపై ఇప్పుడు విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. దీంతో ఎవరి సీటు పోతుంది..? ఎవరి ఫేటు మారుతుంది..?అనే చర్చ జరుగుతోంది.
పార్లమెంట్ సీట్ల డీ లిమిటేషన్ ప్రక్రియ 2026లో జరగనుంది. జనాభా ప్రాతిపదికన లోక్‌సభ సీట్ల కేటాయింపు జరుగుతుందని కేంద్రం తెలిపింది. దీనికి జనాభాను ప్రాతిపదికగా తీసుకుంటే దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందని కేటీఆర్ అన్నారు.