Home » Tag » Security
ప్రస్తుతం షర్మిలకు వన్ ప్లస్ వన్ భద్రత కల్పిస్తున్నారు. అయితే, తనకు ఫోర్ ప్లస్ ఫోర్ భద్రత కల్పించాలని కోరుతూ ఏపీ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డికి లేఖ రాశారు. పోలీస్ ఎస్కార్ వెహికల్ కేటాయించాలని ఆమె లేఖలో పేర్కొన్నారు.
BRS ప్రభుత్వానికి అంటకాగిన వాళ్ళని దూరం పెడుతున్నారు రేవంత్. ఇప్పుడో మరో కీలక శాఖలో అధికారులు, సిబ్బందిని మార్చేశారు రేవంత్. లీకు రాయుళ్ళను తన దగ్గర ఉంచుకోవడం కరెక్ట్ కాదని డిసిషన్‌కు వచ్చారు.
దాదాపు దేశంలోని అత్యధిక వీవీఐపీలు హాజరవ్వబోతున్న అతిపెద్ద ఈవెంట్ ఇది. దేశంతోపాటు ప్రపంచమంతా ఈ వేడుకల కోసం ఎదురు చూస్తోంది. ఈ నేపథ్యంలో అయోధ్యలో అసాధారణ రీతిలో భద్రత ఏర్పాటు చేసింది కేంద్ర ప్రభుత్వం.
తెలంగాణ సీఎంగా రేవంత్ రెడ్డి ప్రమాణస్వీకారం చేసిన తరువాత వరుస నిర్ణయాలతో సంచలనాలకు తెరలేపుతున్నారు. ప్రత్యక్షంగానూ పరోక్షంగానూ ప్రతిపక్షాలకు విమర్శించే ఛాన్స్ కూడా ఇవ్వకుండా దూసుకుపోతున్నారు. ఇప్పటికే పరిపాలనలో పలు మార్పులు చేసిన రేవంత్ రెడ్డి ఇప్పుడు మరో నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. మాజీ సీఎం కేసీఆర్‌కు ఇప్పుడు ఉన్న భద్రతను తగ్గించాలంటూ రేవంత్ ఆదేశించినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం కేసీఆర్‌కు జెడ్ ప్లస్ కేటగిరీ సెక్యూరిటీ ఉంది.
లోక్ సభలో స్మోక్ షెల్స్ విసిరి గందరగోళం సృష్టించిన కేసుపై ఢిల్లీ పోలీసులు, కేంద్ర దర్యాప్తు సంస్థల విచారణ జరుగుతోంది. నిందితులు అసలు ఈ దాడికి ఎందుకు పాల్పడ్డారు.. వీళ్ళ వెనక ఉగ్రవాద సంస్థల ప్రమేయం ఉందా అన్న కోణంలో ఎంక్వైరీ నడుస్తోంది. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరక్కుండా పార్లమెంటు ఆవరణలో భద్రతను కట్టుదిట్టం చేస్తున్నారు. బాడీ స్కానర్స్ లాంటివి తెప్పిస్తున్నారు. భద్రతా ఉల్లంఘనపై 8 మంది భద్రతా సిబ్బందిని సస్పెండ్ చేసింది లోక్ సభ సెక్రటరియేట్.
ఎయిర్ ఫోర్స్ లో పైలెట్ పని చేసి.. తర్వాత రాష్ట్రపతి భవన్ లో విధులు నిర్వహించారు ఉత్తమ్ కుమార్ రెడ్డి. దేశ సేవ నుంచి ప్రజాసేవ చేయాలన్న లక్ష్యంగా రాజకీయాల్లో అడుగుపెట్టాడు. గతంలోనూ మంత్రిగా పనిచేసిన ఉత్తమ్ కు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ సర్కార్ లోనూ కేబినెట్ మినిస్టర్ ర్యాంక్ దక్కింది. 1962లో సూర్యాపేటలో జన్మించిన ఉత్తమ్ కుమార్ రెడ్డి.. బీఎస్సీలో డిగ్రీ చేశారు. తర్వాత భారత వైమానిక దళంలో అడుగుపెట్టారు. పైలట్ గా దేశసేవ చేశారు. రాష్ట్రపతి భవన్ లోనూ పనిచేసే అవకాశం వచ్చింది.
ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికలు జరిగేలా చూడటం ప్రభుత్వం, ఈసీ బాధ్యత. అందువల్లే ఎలాంటి ఉద్రిక్తతలకు తావు లేకుండా.. భద్రతకు ఈసీ ప్రాధాన్యమిస్తుంది. తెలంగాణలో ఈ అసెంబ్లీ ఎన్నికల బందోబస్తు కోసం 375 కంపెనీలకు చెందిన కేంద్ర సాయుధ బలగాలు పని చేస్తున్నాయి.
ముంబైలో షారుఖ్ ఖాన్ నివాసం ఉంటున్న మన్నత్ రెసిడెన్స్‌కూ తరచూ డెత్ నోట్స్ వచ్చాయి. ఈ బెదిరింపులపై షారుఖ్ బృందం మహారాష్ట్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేసింది. దీంతో స్పందించిన మహారాష్ట్ర ప్రభుత్వం షారుఖ్‌కు వై ప్లస్ కేటగిరి భద్రతను కల్పించింది.
భారత్‌లో ముఖ్యంగా తయారీ రంగంలో రోజు రోజుకూ రోబోట్ల వినియోగం పెరుగుతోంది. పనిలో ఖచ్చితత్వం కోసం ఎక్కువగా రోబోట్లను వినియోగిస్తున్నారు. గత పదేళ్లలో రోబోట్ల వినియోసం రెండింతలైంది.
అలిపిరి నడకమార్గంలో నరసింహ స్వామి గుడి వద్ద ఐదవ చిరుతన బోనులో చిక్కినట్లు గుర్తించారు.