Home » Tag » Seethakka
బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్న మంత్రి సీతక్క మాజీ మంత్రి కేటిఆర్ లక్ష్యంగా తీవ్ర వ్యాఖ్యలు చేసారు. కేటీఆర్... చిట్ చాట్ గా కాదు డైరెక్ట్ గా వచ్చి మాట్లాడు అంటూ సవాల్ చేసారు. పండగపూట కూడా మావెంటపడి అనవసరంగా తప్పుడు కూతలు కూసే కేటీఆర్.. మీ కుటుంబం, మీ ఇంట్లో కూడా ఆడవాళ్ళు ఉన్నారు అని హితవు పలికారు.
ఇప్పటి వరకూ పెంకుటిళ్లలో స్కూల్స్‌ను చూశాం. పెద్ద పెద్ద బిల్డింగ్స్‌లో స్కూల్స్‌ని కూడా చూశాం. కానీ కంటైనర్‌లో స్కూల్‌ని ఎప్పుడైనా చూశారా. తెలంగాణ ప్రభుత్వం మొదటి సారి ఈ కంటైనర్ స్కూల్స్‌ను అందుబాటులోకి తెచ్చింది.
తెలంగాణ పాలిటిక్స్‌లో ట్రబుల్ షూటర్ అంటే టక్కున గుర్తొచ్చే పేరు.. హరీష్ రావు. సమస్య ఏదైనా, ఎలాంటిదైనా.. ఒక్కసారి ఆయన అడుగుపెట్టారో.. పరిష్కారం అడ్రస్ వెతుక్కుంటూ వస్తుందని రాజకీయాల్లో టాక్.
తెలంగాణలో ఈనెల 5 లోపు కొత్త మంత్రులు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఆషాఢం రాకముందే కేబినెట్ ను విస్తరించాలని సీఎం రేవంత్ రెడ్డి డిసైడ్ అయ్యారు.
తెలంగాణలో అధికారంలో ఉన్న పార్టీ కాబట్టి...వచ్చే లోక్ సభ ఎన్నికల్లో ఎక్కువ సీట్లు రావాలని కాంగ్రెస్ ప్లాన్ చేస్తోంది. అందుకే అన్ని అవకాశాలను ఉపయోగించుకోవాలని చూస్తోంది. అయోధ్య రామమందిరం నిర్మాణం తర్వాత జనం మూడ్ బీజేపీ సైడ్ మళ్ళింది. కాంగ్రెస్ ప్రాతినిధ్యం వహిస్తున్న ఇండియా కూటమి... ఎన్నికల నాటికి ఇంకా ఎన్ని పీలికలు అవుతుందో తెలియదు. కానీ తెలంగాణలో ఎక్కువ ఎంపీ సీట్లు గెలుచుకోకపోతే రేవంత్ రెడ్డి ఇమేజ్ కు ఇబ్బంది. అందుకే సార్వత్రిక ఎన్నికల ముందు మంచి ప్లాన్ చేశారు కాంగ్రెస్ నేతలు.
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తరువాత ఇప్పటి వరకూ కనిపించని ఐఏఎస్ ఆఫీసర్ స్మిత సబర్వాల్ సెక్రటేరియట్‌కు వచ్చారు. నేరుగా మంత్రి సీతక్కను కలిశారు. మంత్రితో సంతకాలు చేయించి.. ఆ కార్యక్రమం పూర్తయ్యేవరకూ అక్కడే ఉన్నారు.
బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్‌రావు.. కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. అధికారంలోకి వచ్చారు సరే.. రైతుబంధు డబ్బులు ఎప్పుడు వేస్తారు అంటూ ప్రశ్నించారు. ఇస్తాం అని చెప్పగానే సరిపోదని.. ఎప్పుడు వేస్తారో రైతులకు క్లియర్‌గా చెప్పాలంటూ ప్రశ్నించారు.
తెలంగాణలో కొత్తగా ప్రమాణం చేసిన మంత్రులకు శాఖల కేటాయింపు జరిగింది. ఆయా మంత్రులు అనుభవాలను దృష్టిలో పెట్టుకొని శాఖలను కేటాయించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. కీలకమైన హోంశాఖ, మున్సిపల్ వ్యవహారాలు, విద్యాశాఖలను తన దగ్గరే పెట్టుకున్నారు సీఎం. ప్రస్తుతం రేవంత్ కేబినెట్ లో ఆయనతో సహా 12 మంది ఉన్నారు. మరో ఆరుగురు మంత్రులను ఇంకా చేర్చుకునే అవకాశాలు ఉన్నాయి. ఈలోగా ప్రమాణం చేసిన మంత్రులకే అదనపు శాఖలను కూడా అప్పగించారు సీఎం రేవంత్.
నేడు అధికారికంగా తెలంగాణ రాష్ట్ర మంత్రులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రిత్వ శాఖలను కేటాయించారు. మంత్రులకు శాఖల కేటాయింపు విషయంపై శుక్రవారం ఢిల్లీ వెళ్లిన సీఎం.. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అగ్రనేత రాహుల్, గాంధీ, పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ తో సూదీర్ఘ చర్చలు జరిపిన.. అనంతరం మంత్రుల శాఖలపై శనివారం ఓ ప్రకటన చేశారు.
ప్రజల్లో ప్రత్యేక ఆదరాభిమానాలు కలిగిన ఆమె.. ములుగు (ఎస్టీ) నియోజకవర్గంలో కాంగ్రెస్ నుంచి పోటీ చేసి విజయం సాధించారు. ప్రజాగొంతుకగా అందరూ పిలుచుకునే సీతక్క.. తన సమీప ప్రత్యర్థి, బీఆర్ఎస్ నేత బడే నాగజ్యోతిపై 33,700 ఓట్ల ఆధిక్యంతో గెలిచారు.