Home » Tag » Sengol
గత ఏడాది నిర్వహించిన జీ20 సమావేశం వల్ల దేశ ప్రతిష్ట మరింత పెరిగింది. ప్రశ్నాపత్రాల లీకేజీ యువత పాలిట శాపంగా మారింది. ఈ విషయంలో కఠిన చట్టం చేసి, యువతకు అన్యాయం జరగకుండా చర్యలు తీసుకున్నాం.
దేశంలో ప్రతి పౌరుడు గర్వించదగ్గ నిర్మాణమే సెంట్రల్ విస్తా. కొన్ని వందల కోట్ల రూపాయలు వెచ్చించి అందంగా, రమణీయంగా నిర్మించారు. సెప్టెంబర్ 19న తొలి అడుగు పెట్టి సమావేశాన్నిజరుపుకోబోతున్నారు.
కర్ణాటకలో చావు దెబ్బ తిన్న బీజేపీ.. ఇప్పుడు తన ఫోకస్ తమిళనాడుపై పెట్టింది. చోళా రాజదండానికి మోదీ ఇచ్చిన పబ్లిసిటీ.. కొత్త పార్లమెంట్ ప్రారంభోత్సవంలో తమిళ పండితులకు ఇచ్చిన ఇంపార్టెన్స్..తాజాగా ఐపీఎల్ చెన్నైని తమ పార్టీనే గెలిపించిందంటూ బీజేపీ తమిళనాడు అధ్యక్షుడు కామెంట్ చేయడం చూస్తుంటే మోదీ నెక్ట్స్ టార్గెట్ ఏ రాష్ట్రామో క్లియర్ కట్‌గా అర్థమవుతోంది.
కొత్త పార్లమెంట్ ప్రారంభోత్సవ వేడుకలో ప్రధాని మోదీ రాజదండం పట్టుకునే తిరిగారు.. అసలు రాజదండానికి పబ్లిసిటీ ఇవ్వడం కోసమే కొత్త పార్లమెంట్ కట్టారేమో అనిపించేలా ఆయన తీరు సాగింది. పార్లమెంట్ ప్రారంభోత్సవాన్ని ప్రధాని పట్టాభిషేకంలా భావిస్తున్నారంటూ కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు కూడా ఇదే విషయాన్ని నొక్కి చెబుతోంది.
రాజదండం (సెంగోల్)పై వివాదం ముదురుతోంది. ఈ అంశంపై కాంగ్రెస్, బీజేపీ పరస్పర విమర్శలు చేసుకుంటున్నాయి. కాంగ్రెస్ ఎంపీ జైరాం రమేశ్, హోంమంత్రి అమిత్ షా ఈ విషయంలో పరస్పరం విమర్శలు చేసుకుంటున్నారు.
బంగారు రాజదండాన్ని భవనం లోపల స్పీకర్ కుర్చీ సమీపంలో ఏర్పాటు చేయబోతున్నట్లు కేంద్ర హోం మంత్రి అమిత్ షా చెప్పారు. అయితే, సెంగోల్ గురించి తెలిసింది చాలా తక్కువ. దీనికో చారిత్రక నేపథ్యం ఉంది. రాజదండాన్ని సెంగోల్ అంటారు.