Home » Tag » Sharad Pawar
రాజకీయ చాణుక్యుడు.... 50ఏళ్ల పాటు మరాఠా రాజకీయాల్ని కనుసైగలతో శాసించిన కురువృద్ధుడు... అధికారాన్ని తన ఇంట్లో కట్టేసుకున్న శక్తిమంతుడు... కానీ పొలిటికల్ మారథాన్ చివరి మెట్టుపై బోల్తాపడి రాజకీయ నిరుద్యోగిగా మిగిలిపోయాడు. ఆయనే శరద్ పవార్..
మహారాష్ట్ర రాజకీయాలను బిట్ కాయిన్ స్కామ్ షేక్ చేస్తోంది. ఒకటి కాదు రెండు కాదు 6వేల 6వందల కోట్ల కుంభకోణం ఇది. ఇంతకీ ఈ డర్టీ ఎపిసోడ్లో ఉన్నదెవరు...? శరద్ పవార్ కూతురు సుప్రియాసూలే పేరెందుకు వచ్చింది...?
అజిత్, శరద్ పవార్ వర్గాలకు చెందిన ఎమ్మెల్యేలు, పార్టీ నేతలతో దాదాపు పదిసార్లు ఈసీ చర్చలు జరిపింది. వారి వివరణలు తీసుకుంది. చివరకు.. పార్టీ అజిత్ వర్గానికే చెందుతుందని నిర్ణయం తీసుకుంది. పార్టీతోపాటు గుర్తును కూడా అజిత్ వర్గానికే కేటాయించింది.
ఇంకా సమయం ఇస్తే ఇండియా కూటమి పూర్తిస్థాయిలో బలోపేతం అయ్యే అవకాశాలు ఉంటాయని భావిస్తున్న బీజేపీ సర్కారు.. సాధ్యమైనంత త్వరగా ఎన్నికలకు వెళ్లాలని ప్లాన్. తెలంగాణ, ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, మిజోరాం అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యం ..
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని గద్దెదించేందుకు దేశంలోని అన్ని పార్టీలు ఒకే తాటిపైకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తోంది కాంగ్రెస్. ఈమధ్య కాలంలోనే ఇండియా అనే పేరుతో కూటమికి నామకరణం చేశారు. ఇండియా అంటే ఇండియన్ నేషణల్ డెవలప్మెంట్ ఇంక్లూజివ్ అలయన్స్ అని అర్థం. రానున్న రోజుల్లో మహారాష్ట్రలో సమావేశం అయ్యేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
శరద్ పవర్.. ఆ పార్టీ తిరుగుబాటు నేత, తన అన్న కొడుకు అజిత్ పవార్‌తో భేటీ అవ్వడం సంచలనం కలిగిస్తోంది. నిజానికి ఈ భేటీ రహస్యంగానే జరిగినప్పటికీ, విషయం నెమ్మదిగా బయటకు వచ్చింది. దీంతో మహా రాజకీయాల్లో ఏం జరగబోతుంది అన్న చర్చ మొదలైంది.
ఇండియా కూటమిలో అప్పుడే లుకలుకలు మొదలయ్యాయి. మరాఠా నాయకుడు శరద్‌పవార్ వ్యవహరిస్తున్న తీరు కూటమి నేతలకు మింగుడు పడటం లేదు. ఇంతకీ శరద్‌పవార్ ఏం చేశారు..? మిగిలిన పార్టీలు ఎందుకు గుర్రుగా ఉన్నాయి..?
మోదీ అవార్డు స్వీకరించనున్న ఈ కార్యక్రమానికి శరద్ పవార్ ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. ఆయనతోపాటు ముఖ్యమంత్రి ఏక్‌నాథ్‌షిండే, ఉప ముఖ్యమంత్రులు దేవేంద్ర ఫడ్నవీస్‌తోపాటు, అజిత్ పవార్ కూడా హాజరవుతారు. ఎన్సీపీలో తిరుగుబాటు తర్వాత శరద్, అజిత్ కలవబోతుండటం ఇదే మొదటిసారి.
గత ఏడాది ఏక్నాథ్ షిండే ఆధ్వర్యంలోని శివసేన నేతలు బీజేపీలో చేరగా.. తాజాగా ఎన్సీపీకి చెందిన ఎమ్మెల్యేలు కూడా బీజేపీ ప్రభుత్వంలో చేరిపోయారు. ఎన్సీపీలో కీలక నేతగా ఉన్న అజిత్ పవార్ ఏకంగా మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి పదవి చేపట్టారు. ఇది నిజంగా ఎన్సీపీ అధినేత శరద్ పవార్‌కు షాకేనా..?
చీలిపోయింది.. రాజకీయ చాణక్యుడు శరద్‌పవార్ పార్టీ ఎన్సీపీ కూడా నిట్టనిలువునా చీలిపోయింది. అజిత్ పవార్ పార్టీని చీల్చి బీజేపీతో జట్టు కట్టి డిప్యుటీ సీఎం అయిపోయాడు. మొత్తానికి కమలం వ్యూహం ముందు సుదీర్ఘ రాజకీయ అనుభవం ఓడిపోయింది. పవార్ కూడా పవర్ లెస్ అయిపోయాడు.