Home » Tag » Sitting MLAs
వైసీపీకి, ఆ పార్టీ అధినేత జగన్‌కు షాక్‌ల మీద షాక్‌లు తగులుతున్నాయ్. నియోజకవర్గాల మార్పు, సిట్టింగ్‌లకు టికెట్ల నిరాకరణతో.. ఇక తమకు అవకాశం లేదు అనుకున్న నేతలు.. ఒకరి తర్వాత ఒకరు ఎవరి దారి వారు చూసుకుంటున్నారు. ఆళ్లతో మొదలైన రచ్చ.. కంటిన్యూ అవుతూనే ఉంది. ఇప్పుడు విశాఖ వైసీపీలో కలకలం చెలరేగింది. దాడి వీరభద్రరావు ఫ్యామిలీ.. వైసీపీకి దూరం కానుంది.
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు అభ్యర్థుల ఎంపికపై వైసీపీ, టీడీపీ ఆచి తూచి వ్యవహరిస్తున్నాయి. ఇప్పటికే 11 మంది ఇంఛార్జులను మార్చిన జగన్.. మరో 60 మంది ఎమ్మెల్యేలను కూడా ఛేంజ్ చేయబోతున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కూడా జగన్ ఎత్తులకు పై ఎత్తులు వేస్తున్నారు. ఉద్యోగులను ట్రాన్స్ ఫర్ చేసినట్టు.. నియోజకవర్గాల్లో అభ్యర్థులను మార్చడమేంటి అంటున్న బాబు.. తాను మాత్రం ప్రజాభిప్రాయ సేకరణ ద్వారా టీడీపీ అభ్యర్థులకు టిక్కెట్లు ఇస్తానని ప్రకటించారు.
తెలంగాణలోని 115 అసెంబ్లీ స్థానాలకు బీఆర్ఎస్ ప్రకటించిన ఫస్ట్ లిస్టుపై ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ డిబేట్ నడుస్తోంది. ఈ లిస్టులో ముఖ్యమైన అంశాలను 2 ఉన్నాయి. అవేమిటంటే.. తొమ్మిది స్థానాల్లో అభ్యర్థులను మార్చగా.. నాలుగు సీట్లను పెండింగ్‌లో పెట్టారు. బోథ్, స్టేషన్ ఘన్పూర్, ఖానాపూర్, ఆసిఫాబాద్, వైరా, కామారెడ్డి, ఉప్పల్, వేములవాడ, కోరుట్ల స్థానాల్లో అభ్యర్థులను మార్చారు.
హ్యాట్రిక్ విజయం కోసం కేసీఆర్ గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. గెలుపు తప్ప వేరే ఆప్షన్ లేదు అన్నట్లుగా నిర్ణయాలు తీసుకుంటున్నారు.
గత ఎన్నికల్లో 151 మంది ఎమ్మెల్యేలు వైసీపీ తరపున గెలిచారు. వారిలో దాదాపు 50 నుంచి 60మందికి ఈసారి సీటు డౌటేనన్నది వైసీపీ వర్గాల కథనం. 2019లో జగన్ వేవ్‌లో చాలామంది ఎమ్మెల్యేలు ఈజీగా గెలిచేశారు. ఎవరు నిలబడ్డారన్నది పట్టించుకోకుండా జగన్‌ను చూసి ఓట్లేశారు జనం. కానీ ఈసారి అలా కాదు.
అదేదో రేపే ఎన్నికలు అన్నట్లు కనిపిస్తోంది ఏపీలో పొలిటికల్ సీన్ ! ఒకరికి మించి ఒకరు.. ఒకరి తర్వాత ఒకరు.. వ్యూహాలతో అంతకుమించి అనిపిస్తున్నారు. క్లీన్‌స్వీప్ టార్గెట్ అని జగన్ అంటుంటే.. పులివెందులలో జగన్ ఓడిస్తామని టీడీపీ సవాల్ విసురుతోంది.
వైసీపీ విజయం మరోసారి ఖాయం అని అంతా అనుకుంటుంటే.. మూడు నెలల్లో సీన్ మారిపోయింది. టీడీపీ ఒక్కసారిగా దూసుకువచ్చింది. పొలిటికల్ అటెన్షన్ డ్రా చేసింది. దీంతో జగన్ మరింత అప్రమత్తం అయ్యారు.