Home » Tag » Skill Development
చంద్రబాబును స్కిల్ డెవలప్ మెంట్ కేసులో అరెస్ట్ చేసినప్పుడు అప్పటి మంత్రి, BRS పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్... చేసిన కామెంట్స్ ఇప్పుడు కవిత అరెస్ట్ విషయంలో రివర్స్ కొడుతున్నాయి. X లో ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే కేటీఆర్... కవిత అరెస్ట్ పైనా స్పందిస్తున్నారు.
టీడీపీ తెలుగు దేశం జాతీయ కార్యదర్శి నారా లోకేష్ యువగళం పాదయాత్ర నేటి నుంచి పున:ప్రారంభం కానుంది. చంద్రబాబు స్కిల్ డెవలప్ అరెస్ట్ కారణంగా తాత్కాలిక విరామం ప్రకటించి తిరిగి నేడు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా రోజులు నియోజకవర్గం పొదలాడ నుంచే ఉదయం 10 గంటలకు పాదయాత్ర ప్రారంభం అయ్యింది. ఈ యువగళ యాత్రంలో లోకేష్ కు మద్దతుగా పాదయాత్రలో అన్ని నియోజకవర్గాల ఇన్ ఛార్జీలు పాల్గొననున్నారు.
చంద్రబాబు మీద కేసుల పరంపర ఇంకెన్నాళ్లు అనే అనుమానాలు వినిపిస్తున్న వేళ.. స్కిల్ డెవలప్మెంట్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. టీడీపీ హయాంలో స్కిల్ ప్రాజెక్ట్‌లో పాలు పంచుకున్న 12 మంది ఐఏఎస్ అధికారులను విచారించాలని ఏపీ సీఐడీకి ఫిర్యాదు అందింది.
తాజాగా స్కిల్ డెవలప్ కేసులో చంద్రబాబుకు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది ఆంధ్రప్రదేశ్ హైకోర్టు.. ఈ పిటిషన్ పై ఇరు పక్షాల వాదనలు విన్న హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. తిరిగి తమ నిర్ణయాన్ని మంగళవారం వెల్లడిస్తామని.. నేడు మంధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. నాలుగు వారాలపాటు బెయిల్ మంజూరు చేస్తూ న్యాయస్థానం తీర్పు వెలువరించింది.
టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్ ఏపీ రాజకీయాలను మలుపు తిప్పింది. ఆయన అరెస్ట్ తో ఒక్కసారిగా వైసీపీ టీడీపీ మధ్య యుద్ధం తీవ్రతరం అయ్యింది. బాబు అరెస్ట్ అయ్యి దాదాపు 50 రోజులు దాటింది. కానీ ఇప్పటికీ బెయిల్ విషయంలో ఎలాంటి డెవలప్మెంట్ లేదు. మధ్యంతర బెయిల్ విషయంలో ఇవాళ కోర్ట్ నుంచి కీలక తీర్పు రాబోతోంది. ఇలాంటి టైంలో చంద్రబాబుకు మరో కేసులో నోటీసులు జారీ చేశారు సీఐడీ అధికారులు.
విజయనగరం జిల్లా, మెంటాడ, దత్తిరాజేరు మండలాల్లో 561.88ఎకరాల్లో రూ.834 కోట్లతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయానికి శంకుస్థాపన చేసిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్, కేంద్ర విద్య మరియు నైపుణ్యాభివృద్ధిశాఖ మంత్రి ధర్మేంద్రప్రధాన్. బహిరంగ సభకు హాజరైన విద్యార్థులు, ప్రజలు.