Home » Tag » skill development case
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu) నాయుడు స్కిల్ డెవలప్మెంట్ కేసులో దాదాపు 3 నెలల జైలు ఉండి బెయిల్ మీద బయటకు వచ్చిన విషయం తెలిసిందే.. తాజా నేడు సుప్రీంకోర్టులో చంద్రబాబు స్కీల్ డెవలప్ కేసు (Skill Development Case) విచారణ జరిగింది.
మాజీ సీఎం హోదాలో ఉన్న తనను అరెస్టు చేసేటప్పుడు.. సీఐడీ అధికారులు సెక్షన్ 17Aను పాటించలేదని ఏపీ హైకోర్టును ఆశ్రయించారు చంద్రబాబు. తనపై దాఖలు చేసిన ఎఫ్ఐఆర్ను క్వాష్ చేయాలని కోరుతూ.. గతేడాది సెప్టెంబర్ 22న క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు.
ఈ కేసులో తీర్పుపై న్యాయమూర్తుల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. దీంతో ఈ కేసు సుప్రీం ప్రధాన న్యాయమూర్తికి బదిలీ చేస్తూ ద్విసభ్య ధర్మాసనం నిర్ణయం తీసుకుంది. మంగళవారం ఈ కేసుపై సుప్రీం కోర్టు తాజా నిర్ణయం వెల్లడించింది.
స్కిల్ డెవలప్ మెంట్ కేసులో చంద్రబాబు క్వాష్ పిటిషన్ పై సుప్రీంకోర్టులో ఇవాళ తుది తీర్పు రాబోతోంది. 17A చంద్రబాబుకు వర్తిస్తుందని సుప్రీం తీర్పు ఇస్తేనే బాబుకు ఊరట కలుగుతుంది. లేకపోతే బెయిల్ రద్దయి మళ్ళీ జైల్ కు వెళ్ళాల్సిన పరిస్థితి ఉంది.
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) స్కిల్ డెవలప్ మెంట్ కేసులో (Skill Development Case) మంగళవారం కీలకపరిణామం జరగబోతోంది. తనపై పెట్టిన కేసును సవాల్ చేస్తూ టీడీపీ చీప్ చంద్రబాబు సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్ పై తుది తీర్పు రాబోతోంది. స్కిల్ డెవలప్ మెంట్ కేసులో అరెస్ట్ అయిన చంద్రబాబు 52 రోజుల పాటు రాజమండ్రి (Raja Mandri) సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా గడిపారు.
చంద్రబాబును 53 రోజుల పాటు జైల్లో కూడా ఉంచారు. మరి ఆయన ఇప్పుడు జనంలోకి వెళ్ళడానికి అడ్డంకులు తొలగినట్టేనా..? ఈనెల 29 తర్వాత బాబు జనంలోకి వస్తాడా..? అయితే 17A సెక్షన్ కేసులో సుప్రీంకోర్టులో తీర్పు వస్తే అన్నింటిలోనూ బాబుకి రిలీఫ్ దక్కినట్టే అంటున్నారు.
చంద్రబాబు మీడియాతో మాట్లాడవద్దనీ.. భారీ ర్యాలీలు చేపట్టకుండా చర్యలు తీసుకోవాలని సీఐడీ పిటిషన్లో కోరింది. కానీ బాబు బయటకు వచ్చాక.. రాజమండ్రి జైలు దగ్గర గుమికూడిన జనంతో మాట్లాడారు. ఆ వీడియో క్లిప్పింగ్‌ను హైకోర్టుకు సబ్మిట్ చేశారు CID అధికారులు.
చంద్రబాబు స్కిల్ డెవలప్మెంట్ కేసులో అడ్డంగా బుక్కయ్యారు. తొలుత అరెస్టుతో ఆగుతుంది అనుకున్నారు. ఇలా వెళ్లి అలా వెళ్లి వచ్చేస్తాననుకున్నారు. మైలేజ్‌కు మైలేజ్.. రాజకీయంగా క్యాష్ చేసుకోవచ్చని తెలుగు తమ్ముళ్లు భావించారు. కానీ సీన్ రివర్స్ అయింది.
సుప్రీంకోర్టులో ఈ కేసుపై చంద్రబాబు స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేశారు. జస్టిస్ అనిరుద్ధబోస్, జస్టిస్ బేలా ఎం.త్రివేదితో కూడిన బెంచ్ ఎదుట మంగళవారం వాదనలు ముగిశాయి. ఏపీ సీఐడీ తరఫున ముకుల్ రోహత్గీ, చంద్రబాబు తరఫున హరీష్ సాల్వే వాదనలు వినిపించారు.
చంద్రబాబు అరెస్ట్ అయ్యి దాదాపు నెల రోజులు కావొస్తోంది. తెలుగు రాష్ట్రాల చరిత్రలో ఒక మాజీ ముఖ్యమంత్రి ఇన్ని రోజులు జైల్లో ఉండటం ఇదే మొదటిసారి. రోజులు గడుస్తున్న కొద్దీ కేసులో ట్విస్టుల మీద ట్విస్టులు బయటికి వస్తున్నాయి. బెయిల్ వస్తుంది అనుకున్న ప్రతీ సారి ఏదో ఒక సమస్య ఎదురవుతూనే ఉంది. చంద్రబాబుకు నిరాశే మిగులుతోంది.