Home » Tag » skill development scam
అత్యంత క్లిష్టంగా మారిన సెక్షన్ 17ఏ విషయంలో ఇరు పక్షాల వాదనలు విన్న సుప్రీం కోర్టు.. గతేడాది అక్టోబర్లో తుది విచారణ ముగించి తీర్పు రిజర్వ్ చేసింది. ఆ తీర్పును జనవరి 16న చెప్తామంటూ కోర్టు ప్రకటించింది.
ఈ స్కాం కేసులో బాబుకు హైకోర్టు ఇప్పటికే బెయిల్ మంజూరు చేసింది. అయితే హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించింది ఏపీ ప్రభుత్వం. సాక్ష్యాధారాలు సమర్పించినా తమ వాదన పరిగణనలోకి తీసుకోలేదని సీఐడీ అధికారులు సుప్రీంకోర్టు దృష్టికి తీసుకొచ్చారు.
స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో టీడీపీ చీఫ్ చంద్రబాబుకు భారీ ఊరట దక్కింది. హైకోర్టు ఆయనకు గెగ్యూలర్ బెయిల్ మంజూరు చేసింది. ఇప్పటికే ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం.. తాజాగా తీర్పచ్చింది.
చంద్రబాబును రిసీవ్ చేసుకునేందుకు బాలకృష్ణ తన కార్యకర్తలతో కలిసి వెళ్లారు. జైలు నుంచి విడుదలై వచ్చిన తన బావ పేరు మీద పూజ చేయించి ప్రసాదం తీసుకువచ్చారు.
సీఐడీ దాఖలు చేసిన పిటిషన్పై విచారణకు విజయవాడ ఏసీబీ కోర్టు అనుమతి ఇచ్చింది. ఇక అటు స్కిల్ స్కాం కేసులో అరెస్ట్ అయి ఇప్పటికే రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో చంద్రబాబు 50 రోజులుగా రిమాండ్లో ఉన్నారు.
మంగళవారం విచారణ వాడీవేడిగా సాగింది. చంద్రబాబు తరఫున సుప్రీం సీనియర్ లాయర్ హరీష్ సాల్వే, సీఐడీ తరఫున ముకుల్ రోహత్గీ తమ వాదనలు వినిపించారు. ఈ సందర్భంగా సెక్షన్ 17ఏతోపాటు, ఇదే తరహా ఆరోపణలకు సంబంధించి కోర్టులు ఇచ్చిన వివిధ తీర్పుల గురించి తీవ్ర చర్చ జరిగింది.
చంద్రబాబు రిమాండ్ వచ్చే నెల 5 వరకు పొడిగిస్తూ ఏసీబీ కోర్టు ఆదివారం నిర్ణయం తీసుకుంది. దీని ప్రకారం మరో 11 రోజులు.. అంటే అక్టోబర్ 5 వరకు చంద్రబాబు రాజమండ్రి సెంట్రల్ జైలులోనే రిమాండ్ ఖైదీగా ఉండనున్నారు. మరోవైపు చంద్రబాబు సీఐడీ కస్టడీ ముగిసింది.
ఓ ప్రభుత్వ అధికారిగా కేసుకు సంబంధించి ఏమైనా చెప్పాలనుకుంటే ప్రెస్ మీట్ పెట్టొచ్చు లేదా నోట్ విడుదల చేయవచ్చు. కానీ ఆయన అంతకు మించి అన్నట్లు వ్యవహరిస్తున్నారు. ఢిల్లీకి వెళ్లి మరీ నేషనల్ మీడియాకు వివరించాల్సిన అవసరం అసలు లేదు.
చంద్రబాబు అరెస్ట్ సమయంలో, లండన్ పర్యటనలో ఉన్న జగన్ ఇప్పుడు ఏపీకి వచ్చారు. వచ్చీ రావడంతోనే ఢిల్లీ పర్యటనకు సిద్ధం అవుతున్నారనే ప్రచారం జరుగుతోంది. ఇదే ఇప్పుడు మిలియన్ డాలర్ ప్రశ్నలకు కారణం అవుతోంది.
మెమో ఆఫ్ అప్పియరెన్స్ కింద చంద్రబాబు తరపున, థర్డ్ పార్టీ కింద ఏసీబీ కోర్టులో లాయర్ మహేష్ రెడ్డి బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. చంద్రబాబుకి బెయిల్ ఇవ్వాలని కోరారు. స్కిల్ డెవలప్మెంట్ స్కాంలో అరెస్టైన చంద్రబాబు రాజమండ్రి జైలులో ఉన్న సంగతి తెలిసిందే.