Home » Tag » software
అమెరికా ఓటేసింది. ట్రంప్ గెలిచారు... ఇంతవరకు బాగానే ఉంది. మరి మన సంగతేంటి... ట్రంప్ మన కొంప ముంచుతారా..? భారతీయ ఐటీ ఇండస్ట్రీకి గడ్డు రోజులు వచ్చినట్లేనా...? పోలోమంటూ అమెరికా ఫ్లైటెక్కిన ఇండియన్లు తట్టాబుట్టా సర్దుకుని తిరిగొచ్చేయాలా...?
ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ఐటీ రంగంలో పరిస్థితులు తలకిందులవుతున్నాయి. సాఫ్ట్ వేర్ (Software) ఉద్యోగం అంటేనే గ్యారెంటీ లేని జాబ్స్ అయ్యాయి. ఎప్పుడు ఐటీ (IT) కంపెనీ పైకి లేస్తుందో.. ఎప్పుడు కంపెనీ కుదెలు అవుతుందో అని ఐటీ ఉద్యోగులు బిక్కు బిక్కు మంటున్నారు. ఏ క్షణంలో ఉద్యోగం ఊడుతుందో తెలియక వణికిపోతున్నారు.
ఏపీలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయ్. కాకినాడ పార్లమెంట్ పరిధిలో ఊహించని సంఘటనలు చోటుచేసుకుంటున్నాయ్. కాకినాడ కూటమి ఎంపీ అభ్యర్థి ఉదయ్ శ్రీనివాస్ (Uday Srinivas).. ఎన్నికల అఫిడవిట్లో తప్పుడు ధృవ పత్రాలు పెట్టారని ప్రత్యర్థి పార్టీలు భగ్గుమంటున్నాయ్. సర్కిల్ వేసి మరీ హైలైట్ చేస్తున్నాయ్.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో పాటు కొత్తగా అందుబాటులోకి వస్తున్న టెక్నాలజీ భవిష్యత్తులో తమ ఉద్యోగాలకు ఎసరు పెట్టడం ఖాయమని భారతీయ టెక్కీలు టెన్షన్ పడుతున్నారు.
టాటా ఇది కేవలం ఒక పేరు మాత్రమే కాదు.. ప్రపంచం మెచ్చిన బ్రాండ్..వ్యాపారం అంటే డబ్బులు సంపాదించడం ఒక్కటే కాదు.. వ్యాపారం అంటే వ్యక్తిగత సామ్రాజ్యాలను విస్తరించుకోవడం కాదు..అంతకు మించి చాలా ఉంది అని నిరూపించిన సంస్థ టాటా గ్రూప్. విలువలు , సిద్ధాంతాలు, మానవీయత ఈ మూడు లక్షణాలు ఉన్న ఏకైక కంపెనీగా టాటా గ్రూప్‌ను చెపుతారు.
దేశంలోని టాప్ ఐటీ సంస్థలో.. టాటా కన్సల్టెన్సీ సర్వీస్ అలియాస్ టీసీఎస్ ఒకటి. టీసీఎస్‌లో జాబ్ వస్తే లైఫ్ సెటిల్.. ఓ ఢోకా ఉండదు అనుకుంటారు చాలామంది. ఐతే అలాంటి సంస్థను ఇప్పుడో సమస్య వెంటాడుతోంది. సంస్థలోని మహిళా ఉద్యోగులు.. ఒకరి తర్వాత ఒకరు.. మూకుమ్మడిగా రాజీనామాలు చేస్తున్నారు.
పెద్దపల్లి జిల్లా గోదావరిఖనికి చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఆకాంక్ష మృతి కేసులో సంచలన నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. నిన్నటి వరకూ ఆమె ఆత్మహత్య చేసుకుందని అంతా అనుకున్నారు. కానీ ఆకాంక్షను ఆమె ప్రియుడు అర్పిత్ హత్య చేశాడని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు.
భర్తలేని ప్రపంచం భారంగా కనిపించింది. బతుకు లేదేమో అనిపించింది. ఏడడుగులు కలిసిన నడిచిన భార్య.. మరణంలోనూ భర్తతో అడుగులు వేసింది. హైదరాబాద్‌లో జరిగిన ఈ ఘటన ప్రతీ ఒక్కరి మనసు మెలేస్తోంది. కట్టుకున్న భర్త అకాల మరణం.. ఆ మహిళను తీవ్ర మనోవేదనకు గురి చేసింది.
చాట్ జీపీటీ. ఓపెన్ ఏఐ డెవలప్ చేసిన ఈ సాఫ్ట్వేర్ గురించి తెలియనివాళ్లు దాదాపుగా ఉండరు. ఎందుకంటే ఇప్పుడంతా చాట్ జీపీటీ ట్రెండ్ నడుస్తోంది. ఎవరికి ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా ఫస్ట్ చాట్ జీపీటీనే అడుగుతున్నారు. ఆశ్చర్యపరిచే పనితనంతో దాదాపు రోజూ ఏదో ఓ రకంగా వార్తల్లో నిలుస్తోంది ఈ ఆర్టిఫీషియల్ ఇంటలిజెన్స్ టెక్నాలజీ.
బతుకులు మెకానికల్ అయిపోయాయ్ అనిపిస్తుంది సాఫ్ట్వేర్ జంటల జీవితాలు చూస్తుంటే ! భార్యభర్తలది.. ఇద్దరిదీ ఒక్కో షిఫ్ట్. మనస్ఫూర్తిగా మాట్లాడుకోవడం కూడా కుదరదు చాలామందికి ! అందుకే బంధానికి బ్రేకులు పడుతున్నాయ్. విడాకుల వరకు వస్తున్నాయ్. చాలామంది ఉద్యోగాల జీవితాల్లో జరుగుతోంది ఇదే. ఇలాంటి కేసే సుప్రీంకోట్లు మెట్లెక్కింది. సర్వోన్నత న్యాయస్థానం వేసిన ఓ ప్రశ్న ఇప్పుడు.. దేశం అంతా ఆశ్చర్యపోయేలా చేసింది.