Home » Tag » Solar family
ఇక పిల్లలైతే తమ నీడతో కూడా సరదాగా ఆడుకుంటూ ఉంటారు. అయితే కొన్నిసార్లు మన నీడ మాయం అవుతుంది. ఆ విషయం మీకు తెలుసా? ఏంటి షాక్ అవుతున్నారా..? అయితే ఇది మీకోసమే.. కొన్ని సార్లు అలాంటి అరుదైన సంఘటనలు జరుగుతుంటాయి. నీడ మాయం అవ్వడం ఇవాళ ఆవిష్కృతం కాబోతోంది..
సౌరకుటుంబంలో రోజుకు ఒక వింత జరుగుతూ ఉంటుంది. అందులో భాగంగానే ఈ శనివారం అక్టోబర్ 14న అంతరిక్షంలో ఒక దృశ్యం కనిపించనుంది. అదే సూర్యుని లోపల నల్లని ఆకారంలో ఒక వలయం కనిపించనుంది. దీనిని శాస్త్రీయ భాషలో రింగ్ ఆఫ్ ఫైర్ అంటారు. తెలుగులో అయితే కంకణాకార సూర్య గ్రహణం అని పిలుస్తున్నారు.
సౌర కుటుంబానికి ఆవతల భూమి లాంటి మరో గ్రహాన్ని గుర్తించింది నాసా. దానికి 'కే2-18 బి’ అని పేరు కూడా పెట్టింది. నిజానికి ఈ గ్రహాన్ని 2015లోనే గుర్తించారు. ఓ చిన్నపాటి నక్షత్ర మండలంలోన ఈ గ్రహం తిరుగుతోంది. భూమి కంటే 2.6 రెట్లు పెద్దగా ఉన్న ఈ గ్రహాంపై చాలా కాలంగా టెలిస్కోప్ ద్వారా ప్రయోగాలు చేస్తోంది నాసా.