Home » Tag » Sourav Ganguly
టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ గురించి మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. తన కంటే కోహ్లీనే గ్రేట్ అన్నాడు.
ముంబై ఇండియన్స్ (Mumbai Indians) కెప్టెన్ హార్దిక్ పాండ్యా (Captain Hardik Pandya) అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు. ఐపీఎల్ (IPL) చరిత్రలోనే అత్యధిక మ్యాచ్‌లకు సారథ్యం వహించిన ఆటగాళ్ల జాబితాలో భారత దిగ్గజ క్రికెటర్ సౌరవ్ గంగూలీని అధిగమించాడు.
ఐపీఎల్ సీజన్ ముగిసిన తర్వాత టీ20 ప్రపంచకప్-2024 టోర్నీ ఆరంభం కానుండగా.. ఐపీఎల్ ప్రదర్శన ఆధారంగా టీమిండియా వరల్డ్‌కప్ బెర్తులు ఖరారు కానున్నాయి. వికెట్ కీపర్ కోటాలో సంజూ శాంసన్ ఇప్పటికే రేసులో ముందండగా.. పంత్ సైతం తానేమీ తక్కువ కాదన్నట్లు వరుస హాఫ్ సెంచరీలు సాధించాడు.
టీమిండియా వికెట్ కీపర్ రిషభ్ పంత్ రీఎంట్రీపై భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ కీలక వ్యాఖ్యలు చేశాడు. పంత్‌కు మార్చి 5న ఫిట్నెస్ టెస్ట్ నిర్వహిస్తున్నట్టు చెప్పాడు. ఈ టెస్టులో పంత్ కచ్చితంగా పాస్ అవుతాడని ఆశాభావం వ్యక్తం చేశాడు.
బయోపిక్‌లో గంగూలీ పాత్రలో చాక్లెట్ బాయ్ రణ్‌బీర్ కపూర్ కనిపించనున్నాడని ప్రచారం జరిగింది. అయితే ఇప్పుడు హీరో మారనున్నాడు. రణబీర్‌కు బదులు వర్సటైల్ హీరో ఆయుష్మాన్ ఖురానా నటిస్తాడని తెలుస్తోంది. ప్రస్తుతం ఆయుష్మాన్ ఖురానాకు బాలీవుడ్లో మంచి పాపులారిటీ ఉంది.
ఇటీవలి కాలంలో టీమిండియాలో ద్రావిడ్ రకరకాల మార్పులు, చేర్పులు చేసిన సంగతి తెలిసిందే. ఇలా నిరంతరం జట్టులో మార్పులు చేయడం కరెక్ట్ కాదని గంగూలీ అన్నాడు. ఇలా మరీ ఎక్కువ ప్రయోగాలు చేయడం వల్ల జట్టుకు ఎలాంటి ఉపయోగం ఉండదని వార్నింగ్ కూడా ఇచ్చాడు.
టీమిండియాలో నాలుగో స్థానంలో ఆడేందుకు శ్రేయస్ అయ్యర్, తిలక్ వర్మ, సంజూ శాంసన్, కేఎల్ రాహుల్ వంటి ఆటగాళ్లు ఉన్నారని సౌరవ్ గంగూలీ తెలిపాడు. నెంబర్ 4 స్థానానికి లెఫ్టాండర్‌గా తిలక్ వర్మ సరైన ఆప్షన్ అని చెప్పాడు.
వెస్టిండీస్‌పై తొలి రెండు వన్డేల్లో ప్రదర్శన భారత జట్టు ఆటతీరుపై సందేహాలు రేకెత్తించినా.. తమ స్థాయి ఏమిటో చివరి పోరులో టీమిండియా చూపించింది. ఇద్దరు స్టార్ బ్యాటర్లు ఆడకపోయినా, ప్రత్యర్థిని చిత్తు చేయగల సత్తా తమకుందని నిరూపించింది.
బీసీసీఐ మాజీ అధ్యక్షుడు గంగూలీ ఓ ఆటగాడిపై జట్టు మేనేజ్మెంట్ ప్రత్యేక దృష్టి పెట్టాలని కోరాడు. సీనియర్ స్పిన్నర్ యుజ్వెంద్ర చాహల్ కీలకంగా మారతాడని దాదా ఓ ఛానల్‌తో మాట్లాడుతూ అన్నాడు.