Home » Tag » spam calls
ఆన్లైన్.. ఆన్లైన్.. ఆన్లైన్.. నేటి సమాజంలో ఎక్కడ చూసినా ఈ పదం ఊతపదంలా మారిపోయింది. శరీరానికి ధరించే వస్తువుల మొదలు సహాయానికి పిలిపించే ప్యాకర్స్ మూవర్స్ వరకూ ప్రతి ఒక్కరూ ఆన్లైన్ మీదే ఆధారపడుతున్నారు. మనుషులు తమ అవసరాన్ని ఒక మాయాలోకం ద్వారా ఆస్వాదిస్తున్నారు. ఇలా కొందరు వింతానుభూతులు పొందితే.. మరకొందరు మోసపోయారు. ఇందులో మధురానుభూతి పొందిన వారు వేళ్లల్లో లెక్కించేలా ఉన్నాయి సర్వేలో తెలిపిన గణాంకాలు.
సాధారణంగా మనం బైక్ మీద డ్రైవింగ్ సమయంలోనో, లేకపోతే కాస్త ఫ్రీ టైం దొరికి కునుకు తీసినప్పుడో, ఆఫీసు పనిలో బిజీగా గడిపేటప్పుడో ఏవో ఒక తెలియని నంబర్ల నుంచి ఫోన్లు తరచూ వస్తూ ఉంటాయి. వాటినే స్కామ్ లేదా స్పామ్ నంబర్స్ అంటారు. ఇవి మనల్ని తరచూ విసిగిస్తూనే ఉంటాయి. వీటిని కొందరు గుర్తించి సాధారణ కాల్స్ ని లిఫ్ట్ చేయరు. అందుకే వీరు సరికొత్త విధానాన్ని అమలు చేస్తున్నారు. ఈ మధ్య కాలంలో వాట్సాప్ నంబర్లకే కాల్స్ చేస్తున్నారు. వీటిని చెక్ పెట్టేందుకు వాట్సాప్ సరికొత్త ఫీచర్ త్వరలో తీసుకురానుంది.