Home » Tag » Spirit
టాలీవుడ్ లో ప్రభాస్ డామినేషన్ వేరే లెవెల్. బాహుబలి సినిమా తర్వాత రెండు మూడు సినిమాలు ఫ్లాప్ అయితే రెబల్ ను తక్కువ అంచనా వేసిన వాళ్లకు అదే రేంజ్ లో ఆన్సర్ ఇచ్చాడు.
పాన్ ఇండియా లెవల్లో బంగారు బాతులంటే ఒకటి రెబల్ స్టార్, రెండు మ్యాన్ ఆఫ్ మాసెస్, మూడు ఐకాన్ స్టార్... అది కూడా పుష్ప2 అఫీషియల్ వసూళ్ల మీద వస్తున్న కామెంట్లను పక్కన పెడితేనే.. ఐతే ఈ డిస్కర్షన్ కి కారణం, వెయ్యికోట్లు లేదంటే పాన్ ఇండియా హిట్లకు కారణమయ్యే హీరోల క్రేజ్ ని పిండేసుకుంటే పర్లేదు
రెబల్ స్టార్ ప్రభాస్ తో సందీప్ రెడ్డి వంగ ప్లాన్ చేసిన మూవీ స్పిరిట్. కథ సిద్దం, కథనం తో పాటు మొత్తం స్క్రిప్ట్ వర్క్ పూర్తైంది. ఇక మిగిలింది షూటింగ్ మొదలు పెట్టడమే. అందుకు లొకేషన్ల వేటను కూడా మొదలు పెట్టిన సందీప్ రెడ్డి వంగ, సైలెంట్ గా స్పిరిట్ మూవీకోసం ఆఫీస్ ని కూడా మొదలు పెట్టాడు.
ఇండియన్ సినిమాలో రెబల్ స్టార్ ప్రభాస్ పేరు ఇప్పుడు షేక్ అవుతోంది. ప్రభాస్ సినిమాల లైనప్ కె బాలీవుడ్ జనాలకు చెమటలు పడుతున్నాయి. కల్కీ తర్వాత బాలీవుడ్ ను ప్రభాస్... నల్ల మబ్బు కమ్మినట్టు కమ్మేసాడు.
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ గతంలో ఎన్నడూ కనిపించని విధంగా మారిపోబోతున్నాడు. డ్రాగన్ కి అస్సలు లుక్ మార్చాల్సిన పనిలేదంటూ ప్రశాంత్ నీల్ అన్నట్టు వార్తలొచ్చినా, మళ్లీ ఇప్పుడు నిర్ణయాలు మారినట్టున్నాయి.
ఇండియన్ సినిమాలో ఇప్పుడు పాన్ ఇండియా లెవెల్ లో నెంబర్ 1 హీరో ఎవరూ అంటే వినపడే పేరు రెబల్ స్టార్ ప్రభాస్. సినిమా హిట్ ఫ్లాప్ తో ఏ సంబంధం లేకుండా బాక్సాఫీస్ బెండు తీయడానికి ప్రభాస్ తన సినిమాలతో ఓ రకంగా యుద్దమే చేస్తున్నాడు. ప్రభాస్ ఫ్యాన్స్ అయితే సినిమా ఇండస్ట్రీలో ఇది వరల్డ్ వార్ లెక్క అంటూ కాలర్ ఎగరేస్తున్నారు.
సందీప్ రెడ్డి వంగా... ఇప్పుడు ఈ పేరు ఇండియన్ సినిమాను షేక్ చేయడానికి రెడీ అవుతోంది. అర్జున్ రెడ్డితో టాలీవుడ్ కు తాను ఏంటీ అనేది పక్కా లెక్కతో చూపించిన ఈ మెంటల్ మాస్ డైరెక్టర్... యానిమల్ సినిమాతో పాన్ ఇండియా లెవెల్ లో షేక్ చేసేసాడు.
బాలీవుడ్ అయినా టాలీవుడ్ అయినా సందీప్ రెడ్డి వంగా సినిమాలపై జనాలకు ఓ రేంజ్ లో క్లారిటీ ఉంది. తన హీరోని ఎలా చూపించాలో ఆయనకు పిచ్చ క్లారిటీ ఉంటుంది. సినిమాలు చేసింది తక్కువే అయినా... ఇంత షార్ట్ టైం లో ఈ రేంజ్ లో ప్రూవ్ చేసుకుంది వంగా మాత్రమే.
మాస్ హీరోకి క్రేజీ డైరెక్టర్ తగిలితే ఆ బొమ్మ పిచ్చి ఎక్కించడం ఖాయం. ఆ సినిమాపై అంచనాలు కాదు వాటి అమ్మ మొగుడు ఉంటాయి. సినిమా ఏ రేంజ్ లో ఉంటుందో అని వేసే లెక్కలతోనే బాక్సాఫీస్ లో ఉక్కపోత 100 డిగ్రీలు ఉంటుంది.
రెబల్ స్టార్ ప్రభాస్ ప్రేమిస్తే ఎలా ఉంటుంది... డార్లింగ్ చూశాం... రాధేశ్యామ్ చూశాం... బాహుబలిలో శివుడిని కూడా చూశాం.. కాని వర్షం నుంచి కల్కీ వరకు రెబల్ స్టార్ లోని రోమియోని రెబల్ గా చూపించబోతున్నాడు సందీప్ రెడ్డి వంగ...దీనికో లాజిక్కుంది...