Home » Tag » sports-lookback-2024
క్రికెట్ లో 2024 భారత జట్టుకు చిరస్మరణీయమనే చెప్పాలి... గత ఏడాదితో పోలిస్తే ఈ సారి కొన్ని అద్భుత విజయాలు మన సొంతమయ్యాయి. ముఖ్యంగా టీ ట్వంటీ క్రికెట్ లో రెండోసారి మన జట్టు విశ్వవిజేతగా నిలిచింది.
2024 లో క్రికెట్ అభిమానులకు ఒకరకంగా పండగ వాతావరణం అని చెప్పాలి. గత ఏడాది రోహిత్ శర్మ కెప్టెన్సీ లో ప్రపంచ కప్ అలాగే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఓడిపోయిన భారత జట్టు కరేబియన్ దీవులలో జరిగిన టి20 వరల్డ్ కప్ గెలిచేసి సంచలనాలు సృష్టించింది. సౌత్ ఆఫ్రికా పై తక్కువ స్కోరు చేసినా... భారత్ వ్యూహాత్మకంగా విజయం సాధించి రెండోసారి టి20 ప్రపంచకప్ అందుకుంది.