Home » Tag » Sri chaitanya jr. college
వేసవి సెలవులను ఇవ్వకుండా ఇంటర్ బోర్డ్ నిబంధనలకు విరుద్దంగా తరగతులు నిర్వహిస్తున్న శ్రీచైతన్య కళాశాల.
ఇంటర్ బోర్డ్ నిబంధనలకు విరుద్ధంగా క్లాసులు నిర్వహిస్తున్న శ్రీ చైతన్య జూనియర్ కాలేజీ ముందు విద్యార్థి సంఘ నేతలు ఆందోళనకు దిగారు. సనత్ నగర్లో ఉన్న శ్రీ చైతన్య జూనియర్ కాలేజీకి ఎస్ఎఫ్ఐ లీడర్స్ పెద్ద ఎత్తున చేరుకున్నారు. అధికారులకు లంచం ఇచ్చి నిబంధనలకు విరుద్ధంగా క్లాసులు నిర్వహిస్తున్నారంటూ ఆరోపించారు. కాలేజీ మేనేజ్మెంట్తో వాగ్వాదానికి దిగారు. ఎలాంటి తప్పు చేయనప్పుడు విద్యార్థి సంఘ నాయకులను లోనికి పంపేందుకు ఎందుకు నిరాకరిస్తున్నారంటూ ప్రశ్నించారు. వెంటనే అధికారులు కలుగజేసుకుని కాలేజీపై చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేశారు.
శ్రీచైతన్యా కళాశాలలో చదువుతున్న సాత్విక్ ఆత్మహత్య వెనుక అసలు హంతకులు ఎవరు