Home » Tag » Sriharikota
ఇన్శాట్-3డీఎస్ ఉపగ్రహాన్ని ఈ రాకెట్ ద్వారా నింగిలోకి మోసుకెళ్లింది. ఏపీ, శ్రీహరికోటలోని సతీష ధావన్ స్పేస్ సెంటర్ నుంచి సాయంత్రం 05:35 గంటలకు జీఎస్ఎల్వీ నౌకను ఇస్రో అంతరిక్షంలోకి ప్రయోగించింది.
శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి శుక్రవారం మధ్యాహ్నం, 02.35 గంటలకు రాకెట్ నిప్పులు చిమ్ముతూ నింగికి ఎగిరింది. ప్రొపల్షన్ మాడ్యూల్, ల్యాండర్, రోవర్‌ను మోసుకుంటూ శక్తివంతమైన ఎల్వీఎం3-ఎం4 రాకెట్ నిర్ణీత కక్ష్యలోకి చేరుకుంది.
చంద్రయాన్ - 3 శాటిలైట్ ను చంద్రమండలం పైకి పంపించేందుకు సిద్దమైంది ఇస్రో. ఈ ప్రయోగం విజయవంతం అవ్వాలని దేశ ప్రధాని నరేంద్రమోదీ ఆశాభావం వ్యక్తం చేశారు.
దేశ అంతరిక్ష చరిత్రలో అత్యంత క్లిష్టమైన, సాహసోపేతమైన ప్రయోగం ఇది. జాబిల్లికి చేరువ కావాలన్న లక్ష్యంతో కోట్లాది మంది భారతీయుల ఆశలు నెరవేర్చేందుకు ఇస్రో చేపటిన చంద్రయాన్ 3 ప్రాజెక్ట్ ప్రయోగం.. మరికొన్ని గంటల్లో జరగబోతోంది. ఈ ప్రతిష్ఠాత్మక ప్రయోగానికి శ్రీహరికోటలోని సతీశ్ ధావన్ అంతరిక్ష ప్రయోగ కేంద్రం వేదిక అవుతోంది.
హిందీ చీనీ భాయ్ భాయ్ అన్న రోజులు పోయాయి. చైనా ప్రతి చర్యను అనుమానంతో చూడాల్సిన రోజులు వచ్చాయి. ప్రపంచానికి తానే సూపర్ పవర్‌గా ఉండాలని భావిస్తున్న చైనా ఆధిపత్యపు, దురాక్రమణ వైఖరి ప్రపంచ దేశాలకు ముప్పుగా మారుతోంది. ముఖ్యంగా మనదేశానికి చైనా నుంచి నిత్యం ముప్పు పొంచే ఉందని చెప్పాలి. వరుస యుద్ధ విన్యాసాలతో తైవాన్‌పై కాలుదువ్వుతున్నచైనా తన చుట్టూ ఉన్న దేశాలపై నిఘాను మరింత పెంచుతోంది. మన దేశానికి సంబంధించిన రహస్య సమాచారాన్ని తెలుసుకునేందుకు తమకు అనుకూలంగా ఉన్న దేశాలను అడ్డంగా వాడుకుంటోంది. పొరుగు దేశాల్లో భారీగా నిర్మాణాలు చేపడుతూ అక్కడి నుంచే భారత్ పై నిఘా పెంచుతోంది డ్రాగన్ కంట్రీ. మన దేశానికి సంబంధించి పరిశోధనలు, ప్రయోగాలు, ఇతర పరీక్షలకు చెందిన సమాచారాన్ని ముందుగానే పసిగట్టి భారత్‌కు వ్యతిరేకంగా కుట్రలు చేసే ప్రయత్నాలు మరోసారి వెలుగులోకి వచ్చాయి.