Home » Tag » Steve Smith
ఊహించినట్టుగానే ఆస్ట్రేలియా సీనియర్ ప్లేయర్ స్టీవ్ స్మిత్ కు మళ్ళీ జట్టు సారథ్య బాధ్యతలు దక్కాయి. శ్రీలంకతో జరగనున్న రెండు టెస్టుల సిరీస్ కోసం స్మిత్ ను కెప్టెన్ గా ఎంపిక చేశారు.
ఐపీఎల్ అంటేనే సంచలనాలకు చిరునామా... ఈ సంచలనాలు కేవలం గ్రౌండ కే పరిమితం కాదు... ఆటగాళ్ళ వేలంలోనూ కనిపిస్తూనే ఉంటాయి. తాజాగా ఐపీఎల్ మెగా వేలంలో కొందరు స్టార్ ప్లేయర్స్ రికార్డు ధర పలికితే... మరికొందరికి షాక్ తగిలింది. కనీసం బేస్ ప్రైస్ కు తీసుకునేందుకు కూడా ఫ్రాంచైజీలు బిడ్ వేయలేదు.
ఐపీఎల్ మెగావేలంలో ఈ సారి పలువురు సీనియర్ ప్లేయర్స్ కు షాక్ తగిలింది. ఊహించినట్టుగానే వెటరన్ ప్లేయర్స్ ను ఫ్రాంచైజీలు పెద్దగా పట్టించుకోలేదు. ఫ్రాంచైజీలు పట్టించుకోని ఆటగాళ్ళ జాబితాలో విదేశీ క్రికెటర్లతో పాటు భారత స్టార్ క్రికెటర్లు కూడా ఉన్నారు.
తొలి రెండు టెస్టుల్లో పరాజయం పాలైన ఇంగ్లండ్.. ఎట్టకేలకు మూడో మ్యాచ్‌లో ఆస్ట్రేలియాను ఓడించింది. ఈ మ్యాచ్‌లో ఎన్నో రికార్డులు కూడా క్రియేట్ కావడం విశేషం. లీడ్స్‌లోని హెడింగ్లీ మైదానంలో జరిగిన యాషెస్ సిరీస్‌లోని మూడో టెస్టు మ్యాచ్‌లో ఇంగ్లండ్ టీం ఆస్ట్రేలియాపై 3 వికెట్ల తేడాతో విజయం సాధించింది.
ఆస్ట్రేలియా మాజీ సారథి స్టీవ్ స్మిత్ ఇంగ్లాండ్‌లో ఇంగ్లాండ్‌పై తనకు తిరుగులేదని నిరూపిస్తున్నాడు. వయసు పైబడుతున్నా తనలో సత్తా తగ్గలేదని.. సెంచరీల మీద సెంచరీలు బాదుతున్నాడు.
అతి తక్కువ టెస్టుల్లో తొమ్మిది వేల పరుగులు పూర్తి చేసిన ఆటగాడిగా నిలిచాడు స్టీవ్ స్మిత్. లార్డ్స్‌లో జరుగుతున్న యాషెస్ సిరీస్‌లో రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్‌పై 31 పరుగులు చేసిన తర్వాత స్మిత్ ఈ రికార్డు అందుకున్నాడు.
ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్ మ్యాచ్‌లో టీమ్ఇండియా ఓడిపోవడానికి ప్రధాన కారణం బ్యాటింగ్‌లో విఫలం కావడం. అయితే, ఆస్ట్రేలియా మాత్రం ఆ విషయంలో తడబాటుకు గురి కాకుండా రాణించింది.