Home » Tag » storms
తెలంగాణలో మరో మూడు రోజులు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా తేలికపాటి వర్షాలతో పాటు మరికొన్ని చోట్ల ఒక మోస్తరు వర్సాలు కురుస్తాయని తెలిపింది.
తెలంగాణ వ్యాప్తంగా వాతావరణం చల్లబడింది. ఉపరితల ద్రోణి, ఆవర్తనం ప్రభావంతో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని కొన్ని ప్రాంతాల్లో ఉదయం నుంచి తేలికపాటి చినుకులు కురుస్తున్నాయి.
తెలుగు రాష్ట్రాల్లో రోజు రోజుకు ఉష్ట్రోగ్రతలు క్రమంగా పడిపోతున్నాయి. పగటిపూట కూడా ఉష్ణోగ్రతలు చాలా తక్కువగా నమోదు అవుతున్నాయి. విపరీతంగా చలి పెరిగిపోతుండటంతో ప్రజలు ఇళ్లకే పరిమితం అవుతున్నాయి. పొగమంచు కమ్మెయ్యడంతో రహదారుల్లో ముందు ఏం ఉందో కూడా కనిపించడం లేదు. దీంతో పగలు కూడా లైట్లు వేసుకుని వేసుకుని వాహనదారులు వెళ్తున్నారు.
మిచౌంగ్ తుఫాన్ ఎఫెక్ట్ ఆంధ్రప్రదేశ్, తమిళనాడుతో పాటు తెలంగాణపైనా కూడా తీవ్ర ప్రభావం చూపించింది. భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తుండటం, గంటకు 100 కిలో మీటర్ల వేగంతో ఈదురు గాలులు వీయడంతో.. లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. రైతులకు భారీగా నష్టం వాటిల్లింది. ఏపీలో 8 జిల్లాల్లోని 60 మండలాల్లో తుఫాన్ ప్రభావం కనిపించింది. చేతికి అందిన పంటలు వరదపాలవడంతో అన్నదాతలు లబోదిబోమంటున్నారు.
డొమినికన్ రిపబ్లిక్ రాజధాని మధ్యలో రాకపోకలు సాగిస్తున్న వాహానాలు.. కాంక్రీట్ గోడ కూలిపోవడంతో నిలిపివేశారు. ఆ సమయంలోనే భారీ వరదలు సంభవించి నిలిచిపోయిన వాహనాలు అన్ని కూడా వరదల్లో కొట్టుకుపోయాయి.