Home » Tag » Sudan
యుక్రెయిన్-రష్యా-సూడాన్.. ఈ మూడు దేశాల్లో యుక్రెయిన్, సూడాన్‌లో యుద్ధం సాగుతోంది. దీనికి కర్త, కర్మ, క్రియ రష్యానే. ఇంకా చెప్పాలంటే పుతిన్‌తో నిత్యం అంటకాగుతూ కిరాయి సైన్యాన్ని నడిపిస్తున్న ఓ వ్యాపారసంస్థే దీనికి కారణం. దానిపేరే.. వ్యాగ్నర్ గ్రూప్.
సూడాన్‌లో రెండు సైనిక వర్గాల మధ్య ఘర్షణ తలెత్తింది. దీంతో దేశంలోని అనేక ప్రాంతాలను రెండు సైనిక వర్గాలు తమ స్వాధీనంలోకి తెచ్చుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఇదే క్రమంలో ఖార్టౌమ్ పట్టణంలో ఉన్న నేషనల్ పబ్లిక్ హెల్త్ ల్యాబొరేటరీని సైన్యం స్వాధీనం చేసుకుంది.
అనేక దేశాలు సూడాన్‌లో ఉన్న తమ పౌరుల్ని సురక్షితంగా వెనక్కు తెప్పించే ప్రయత్నాలు మొదలుపెట్టాయి. ఇప్పటికే అమెరికా తమ రాయబార కార్యాలయ సిబ్బందిని సురక్షితంగా రక్షించింది. ఇప్పుడు భారత్ కూడా రంగంలోకి దిగింది. సూడాన్‌లో చిక్కుకున్న భారతీయుల్ని ఇండియాకు తరలిస్తోంది.
దేశం తగలబడుతోంది..రాజధాని రణరంగంగా మారింది.. జన సంచారంతో సందడిగా కనిపించాల్సిన వీధులు శవాలతో శ్మశానాన్ని తలపిస్తున్నాయి. జన్మనిచ్చిన భూమిలో రక్తం ఏరులై పారుతుంటే రేపు తమ తల కూడా తెగిపోతుందేమోనన్న ప్రాణభయంతో ప్రజలు వలసబాట పట్టారు.
దేశాన్ని రక్షించాల్సిన సైన్యం దేశ ప్రజల ప్రాణాలు తీస్తోంది. విదేశీ చొరబాట్ల నుంచి రక్షించేందుకు దేశానికి కంచుకోటగా ఉండాల్సిన సైన్యం దేశాన్ని ముక్కలు చేస్తోంది. మిలిటరీ యూనిఫాంలో ఉండి ప్రజలతో సెల్యూట్ కొట్టించుకోవాల్సిన సైనికుడు ఆ దేశ ప్రజల రక్తం కళ్ల చూస్తున్నాడు. ఇంతకు మించిన దాష్టీకం మరొకటి ఉంటుందా ? ఏ సైన్యమైతే తమను రక్షిస్తుందని ప్రజలు భరోసాతో ఉన్నారో అదే సైన్యం తుపాకీ గుళ్లను దించుతుంటే ఇక ఆదేశంలో బతికేదెలా ? మొన్నటికి మొన్న మియన్మార్... కొన్నేళ్ల క్రితం పాకిస్థాన్.. తాజాగా సూడాన్.. మిలటరీ పాలకుల బరితెగించిన అధికార దాహానికి బలైపోతున్నాయి. సూడాన్‌లో రెండు మిలటరీ వర్గాల మధ్య చెలరేగిన అంతర్గత ఘర్షణ చివరకు భారతీయుడి సహా అనేక మంది ప్రాణాలను పొట్టనపెట్టుకుంది.