Home » Tag » Surgery
తాజాగా హీరో రవితేజ (Ravi Teja) కుడి చేతికి గాయం అవడంతో యశోద ఆసుపత్రి వైద్యులు శస్త్రచికిత్స చేశారు. అనంతరం ఆరు వారాలపాటూ విశ్రాంతి తీసుకోవాలని సర్జరీ చేసిన ప్రత్యేక డాక్టర్ల బృందం సూచించింది. ఈ మేరకు ఆయన హైదరాబాద్ లోని తన నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది.
మోకాలి సర్జరీ సక్సెస్ అయిందని.. ప్రభాస్ కోలుకున్నాడని అంతా అనుకున్నారు. కానీ ఇప్పుడు ఆ గాయం తిరగబెట్టిందని.. మళ్లీ సర్జరీ తప్పదంటూ ఓ న్యూస్.. సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ప్రస్తుతం కల్కి 2829 AD, రాజా సాబ్ చిత్రాల షూటింగ్స్‌లో ప్రభాస్ పాల్గొంటున్నాడు.
తాను త్వరగా కోలుకోవాలని శుభాకాంక్షలు తెలిపిన వారికి సూర్యకుమార్ ట్విటర్ వేదికగా ధన్యవాదాలు చెప్పాడు. హాస్పిటల్ బెడ్ మీద ఉన్న ఫొటోను ట్వీట్ చేశాడు. త్వరలో పునరాగమనం చేస్తా అంటూ ట్వీట్లో రాసుకొచ్చాడు.
కేసీఆర్‌కు ప్రస్తుతం ఆపరేషన్ నొప్పి తగ్గి, సాధారణ నొప్పి మాత్రమే ఉందని వైద్యులు తెలిపారు. ఆయన శారీరకంగా, మానసికంగా దృఢంగా ఉన్నారని చెబుతున్నారు. సాధారణ డైట్ తీసుకుంటున్నారని చెప్పారు.
మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గాయం నుంచి క్రమంగా కోలుకుంటున్నారు. ప్రస్తుతం యశోద హాస్పిటల్లో డాక్టర్ల పర్యవేక్షణలో ఆయన ఉన్నారు. కేసీఆర్‌కు హిప్ రీప్లేస్మెంట్ ఆపరేషన్ చేసిన డాక్టర్లు 24 గంటలు తిరగకముందే ఆయనతో వాకింగ్ కూడా చేయించారు. మరి కొన్ని వారాల పాటు కేసీఆర్ బెడ్ రెస్ట్ తీసుకోబోతున్నారు. ఎప్పుడూ రాజసం ఉట్టిపడేలా మీటింగ్‌లలో గర్జించే కేసీఆర్‌ను ఈ పరిస్థితిలో చూసి బీఆర్ఎస్ కార్యకర్తలు, ఆయన అభిమానులు తల్లిడిల్లిపోతున్నారు.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మాజీ సీఎం కేసీఆర్ ను పరామర్శించారు. తెలంగాణ ముఖ్యమంత్రి వెంట మంత్రి మంత్రి సీతక్క, షబ్బీర్ అలీ ఉన్నారు. ముందుగా మొదటి సారి సీఎం హోదాలో యశోద ఆసుపత్రికి వచ్చిన రేవంత్ రెడ్డి ఆసుపత్రి యాజమన్యం స్వాగతం పలికింది. అనంతరం కేసీఆర్ వద్దకు మాజీ మంత్రి కేటీఆర్ రేవంత్ చేతిలో చేయి వేసి ఓనికి వెళ్లారు. కేటీఆర్ తో కలిసి కేసీఆర్ ను పరామర్శించించారు.
యశోద ఆసుపత్రికి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి.. మరి కాసేపట్లో సీఎం రేవంత్ రెడ్డి యశోద ఆసుపత్రికి వెళ్లనున్నారు. మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కలిసి పరామర్శించనున్నారు. ప్రస్తుతం కేసీఆర్ సోమాజిగూడలోని యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. రేవంత్ రెడ్డి మధ్యాహ్నం ఆసుపత్రికి వెళ్లి కేసీఆర్ ప్రమాదం ఆరా తీయనున్నారు. ఇక శుక్రవారం కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ ఆధ్వర్యంలో కేసీఆర్ కు 20 మంది వైద్యుల బృందం సర్జరీ నిర్వహించింది. ఆ తర్వాత పలువు సీనియర్ జానారెడ్డి వంటి నాయకులు ఆసుపత్రికి వెళ్లి పరామర్శిస్తున్నారు.
గాయాల నుంచి కోలుకుంటున్న జస్ప్రీత్ బుమ్రా, ప్రసిద్ధ్ కృష్ణ, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, రిషభ్ పంత్ ఫిట్నెస్ లెవల్స్‌పై బీసీసీఐ అప్డేట్ ఇచ్చింది. ఏడాదికి పైగా క్రికెట్‌కు దూరమైన జస్ప్రీత్ బుమ్రా అతి త్వరలోనే క్రికెట్ మైదానంలో అడుగు పెట్టనున్నాడు.
గతేడాది ఆగస్టులో ఇంగ్లాండ్ పర్యటన ముగిసిన తర్వాత వెన్నునొప్పి పేరుతో సుమారు ఏడాదికాలంగా టీమ్‌కు దూరంగా ఉంటున్న స్టార్ పేసర్ జస్పీత్ బుమ్రా టీమిండియా ఫ్యాన్స్‌కు త్వరలోనే గుడ్ న్యూస్ చెప్పనున్నాడు.
సీనియర్ నటుడు శరత్ బాబు గుండెపోటుకు గురైయ్యారు. నిన్నటి నుంచి ఆసుపత్రిలో ట్రీట్మెంట్ పొందుతున్నారు.