Home » Tag » Surya Kumar Yadav
దేశవాళీ క్రికెట్ టీ ట్వంటీ టోర్నీ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో పలువురు స్టార్ క్రికెటర్లు సత్తా చాటుతుంటే మరికొందరు అట్టర్ ఫ్లాప్ అవుతున్నారు. టీమిండియా సీనియర్ క్రికెటర్లు సైతం ఈ టోర్నీలో ఆడుతుండగా.. సూర్యకుమార్ యాదవ్, శివమ్ దూబే, మహ్మద్ షమీ మెరిసారు.
టీమిండియా స్టార్ బ్యాట్స్మెన్ సంజూ శాంసన్ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో అదరగొడుతున్నాడు. హైదరాబాద్లోని రాజీవ్ గాంధీ స్టేడియంలో సంజూ మరోసారి విద్వాంకర ఇన్నింగ్స్ కు తెరలేపాడు.
టీ ట్వంటీ ఫార్మాట్ లో భారత క్రికెటర్ తిలక్ వర్మ సూపర్ ఫామ్ కంటిన్యూ అవుతోంది. ఇటీవల సఫారీ గడ్డపై వరుసగా రెండు సెంచరీలతో దుమ్మురేపిన ఈ హైదరాబాదీ ప్లేయర్ సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీలోనూ పరుగుల వరద పారిస్తున్నాడు.
భారత టీ ట్వంటీ క్రికెటర్ తిలక్ వర్మ సూపర్ ఫామ్ కొనసాగుతోంది. ఇటీవల సౌతాఫ్రికాతో సిరీస్ లో వరుసగా రెండు శతకాలు బాదిన తిలక్ తాజాగా దేశవాళీ క్రికెట్ లోనూ దుమ్మురేపుతున్నాడు. సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీలో హైదరాబాద్ తరపున బరిలోకి దిగిన తిలక్ వర్మ మేఘాలయపై సెంచరీ బాదేశాడు.
టీ ట్వంటీ ఫార్మాట్ లో భారత్ డామినేషన్ కంటిన్యూ అవుతోంది. వరల్డ్ కప్ విజయం తర్వాత మన జోరు ఏమాత్రం తగ్గలేదు. ఇటీవల సౌతాఫ్రికాతో సిరీస్ లోనూ భారత క్రికెటర్లు దుమ్మురేపారు. వారి సూపర్ ఫామ్ తో ఇప్పుడు టీ ట్వంటీ ర్యాంకింగ్స్ లోనూ మనదే పైచేయిగా నిలిచింది.
సౌతాఫ్రికా పర్యటనలో టీమిండియా చివరి మ్యాచ్ కు రెడీ అయింది. శుక్రవారం జోహెనస్ బర్గ్ వాండరర్స్ స్టేడియం వేదికగా ఆఖరి టీ ట్వంటీ మ్యాచ్ జరగనుంది. మూడో టీ ట్వంటీలో గెలిచిన భారత్ 2-1 ఆధిక్యంలో నిలిచింది. చివరి మ్యాచ్ లోనూ గెలిచి సిరీస్ కైవసం చేసుకోవాలని భావిస్తోంది.
భారత క్రికెట్ లో సంజూ శాంసన్ నైపుణ్యం గురించి అందరికీ తెలిసిందే.. కానీ ఎన్ని అవకాశాలిచ్చినా గతంలో సరిగ్గా వినియోగించుకోలేక వెనుకబడిపోయాడు. అయితే ఇటీవల బంగ్లాదేశ్ తో సిరీస్ దగ్గర నుంచి సంజూ అదరగొడుతున్నాడు.
టీ ట్వంటీ ఫార్మాట్ లో శతకం అంటే ఎంత ప్రత్యేకమో అందరికీ తెలిసిందే...ఒక సెంచరీ కొట్టడమే కష్టం...అలాంటిది వరుసగా రెండు సెంచరీలు బాదితే ఆ కిక్కే వేరు...ప్రస్తుతం ఇలాంటి కిక్కును సంజూ శాంసన్ ఆస్వాదిస్తున్నాడు.
సౌతాఫ్రికాతో శుక్రవారం జరిగిన తొలి టీ20లో టీమిండియా ఘన విజయం సాధించింది. సంజూ శాంసన్ మెరుపు సెంచరీతో భారత జట్టుకు అద్భుత విజయాన్ని అందించాడు. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా 20 ఓవర్లలో 8 వికెట్లకు 202 పరుగులు చేసింది.
ఒకవైపు ఆస్ట్రేలియాతో టెస్ట్ సిరీస్ కోసం సీనియర్లు సన్నద్ధమవుతుంటే... మరోవైపు యువ ఆటగాళ్ళతో కూడిన యంగ్ ఇండియా సఫారీ గడ్డపై టీట్వంటీ సిరీస్ కు రెడీ అయింది. సౌతాఫ్రికాతో నాలుగు టీ ట్వంటీల సిరీస్ లో భాగంగా తొలి మ్యాచ్ శుక్రవారం జరగబోతోంది.