Home » Tag » T Congress
పార్లమెంట్ ఎన్నికల్లోపే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కాంగ్రెస్‌లో చేర్చుకుంటామని.. 30 మంది ఎమ్మెల్యేలు తమతో టచ్‌లో ఉన్నారని.. బీఆర్ఎస్ఎల్పీని విలినం చేస్తామని కూడా కాంగ్రెస్ చెప్పుకొచ్చింది. కానీ, పరిస్థితులు చూస్తే అలా కనిపించడం లేదు.
ఏప్రిల్ మొదటి వారంలో హైదరాబాద్ శివారులోని తుక్కుగూడలో భారీ బహిరంగ సభ నిర్వహించబోతుంది. ఈ సభకు ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గేతోపాటు కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ హాజరుకానున్నారు.
పెళ్లి చేసుకున్న ఆడబిడ్డలకు లక్ష రూపాయలతో పాటు.. తులం బంగారం ఇస్తామని ఎన్నికల హామీల్లో కాంగ్రెస్ ప్రకటించింది. దీంతో ఈ పథకం ఎప్పటి నుంచి అమలు అవుతుందా అని జనాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి మాణిక్ రావు ఠాక్రే ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశానికి సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి సహా పలువురు కాంగ్రెస్ నేతలు హాజరయ్యారు. 5 అంశాల ఎజెండాగా ఈ పీఏసీ సమావేశం సాగింది.
రాబోయే పార్లమెంట్ ఎన్నికలకు సన్నద్ధత, కాంగ్రెస్ పార్టీ పది రోజుల పాలనపై సమీక్షించారు. అలాగే ఖాళీగా ఉన్న రెండు మూడు జిల్లాల డీసీసీల నియామకంతోపాటు శాసన మండలిలో ఎమ్మెల్సీ పదవులు, నామినేటెడ్ పోస్టులు, కార్పొరేషన్ల ఛైర్మన్ల పోస్టుల భర్తీ వంటి అంశాలపై చర్చించినట్లు తెలుస్తోంది.
ఒకప్పటితో కంపేర్ చేస్తే తెలంగాణలో కాంగ్రెస్ పరిస్థితి ఇప్పుడు మెరుగుపడింది. కాస్త కష్టపడితే ఈసారి అధికారంలోకి వచ్చే అవకాశం కూడా ఉంది. దీంతో ఈ ఛాన్స్‌ను మిస్ చేసుకోవద్దు అనుకుంటోంది కాంగ్రెస్ అధిష్టానం. అందుకే అంది వచ్చిన ప్రతీ చిన్న అవకాశాన్నీ వాడుకుంటోంది.
త్వరలో పూర్తిస్థాయిలో ప్రజల్లోకి వెళ్లేందుకు పార్టీ సిద్ధమవుతోంది. ఈ నెల నుంచే కాంగ్రెస్.. బస్సు యాత్రలు ప్రారంభించబోతుంది. కాంగ్రెస్ నేతలు రాష్ట్రవ్యాప్తంగా పర్యటించబోతున్నారు. బస్సు యాత్రకు సంబంధించిన ఏర్పాట్లను పార్టీ శ్రేణులు యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేస్తున్నాయి. ఈ బస్స యాత్రలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కూడా పాల్గొనబోతున్నారు.
ఎంతోమంది సీనియర్ నాయకులు ఉన్నా.. వారికి విజయం సాధించే సత్తా ఉన్నా.. వారి మధ్య జరిగే గొడవలే వాళ్ల ఓటమికి కారణాలు అవుతున్నాయన్నది బహిరంగ రహస్యం. అలాంటి కాంగ్రెస్‌లో.. తెలంగాణకు రేవంత్ రెడ్డి టీపీసీసీ అధ్యక్షులు అయిన తర్వాత కాస్త ఊపు వచ్చింది.
తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఈ 6 పథకాల్ని కచ్చితంగా అమలు చేస్తామని ప్రకటించింది. ఆరు గ్యారెంటీ పథకాలివి. అవి మహాలక్ష్మీ పథకం, రైతు భరోసా, ఇందిరమ్మ ఇండ్ల పథకం, గృహజ్యోతి పథకం, చేయూత పథకం, యువ వికాసం.
తెలంగాణలో కమ్యూనిస్ట్ పార్టీలు కాంగ్రెస్ తో జోడీ కట్టేందుకు దాదాపు సిద్దమైంది. రేపోమాపో ఎన్ని సీట్లు కేటాయిస్తారన్న విషయంలో స్పష్టత రానుంది.