Home » Tag » T20I
బౌలింగ్ జట్టు తదుపరి ఓవర్ మొదటి బంతిని 60 సెకన్లలోపు వేయడానికి సిద్ధంగా ఉండాలి. బౌలింగ్ జట్టు ఒక ఇన్నింగ్స్‌లో మూడు సార్లు 60 సెకన్లలోపు సిద్ధంగా లేకుంటే, వారు అపోజిషన్ జట్టుకు పెనాలిటీ రూపంలో ఐదు పరుగులను అదనంగా అందించిన వాళ్లవుతారు.
వన్డే, టీ20 జట్లకు ఎయిడెన్ మార్క్రమ్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. ఫ్రీడం సిరీస్‌గా నామకరణం చేసిన ఈ మల్టీ ఫార్మాట్ సిరీస్‌లో రెండు జట్ల మధ్య మూడు టీ20లు , మూడు వన్డేలు, రెండు టెస్ట్ మ్యాచ్‌లు జరుగుతాయి.
జట్టులో ఎవరి మీద వేటు పడకపోగా.. దీపక్ చాహర్‌ను అదనంగా స్క్వాడ్‌లోకి చేర్చారు. 2022 డిసెంబర్లో చివరి అంతర్జాతీయ మ్యాచ్ ఆడిన ఈ ఫాస్ట్ బౌలర్.. ఏడాది తర్వాత టీమిండియాలోకి ఎంట్రీ ఇచ్చాడు. నవంబర్ 28 గౌహతిలో ఆస్ట్రేలియాతో జరిగిన మూడో టీ20కి ముందు దీపక్ చాహర్‌ను భారత జట్టులోకి తీసుకున్నారు.
సూర్య మరో రెండు ఇన్నింగ్స్‌ల్లో 159 పరుగులు చేస్తే వీరిద్దరి రికార్డ్ సమం చేస్తాడు. ఒక్క ఇన్నింగ్స్‌లో 159 పరుగులు చేయడం కష్టం కాబట్టి సూర్య ఉన్న ఫామ్‌కు రెండు ఇన్నింగ్స్‌ల్లో ఈ ఘనత సాధించే అవకాశం ఉంది. ఈ క్రమంలో స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ రికార్డ్‌పై కన్నేశాడు.
ఆస్ట్రేలియాతో ఐదు మ్యాచ్‌ల T20 సిరీస్‌కు టీమిండియా జట్టును ప్రకటించింది. ఈ 15 మంది సభ్యుల జట్టులో సంజూ శాంసన్‌ను చేర్చలేదు. సంజూ శాంసన్ పేరు కనిపించకపోవడంతో అభిమానులు మరోసారి భారత సెలెక్టర్లపై ప్రశ్నలు లేవనెత్తారు.
ఇప్పుడు మాక్స్వెల్ జట్టులో లేకపోవడంతో వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ మాథ్యూ వేడ్‌కు ఆసీస్ జట్టులో అవకాశం కల్పించారు. టీ20 ప్రపంచకప్ 2022లో చివరిసారిగా ఆసీస్ తరపున ఆడిన వేడ్ ఆ తర్వాత ఆసీస్ జట్టులో కనిపించలేదు.
ఐర్లాండ్‌తో సిరీసులో టీమిండియాకు కొత్త ఓపెనింగ్ జోడీ ఆడటం ఖాయమైంది. ఈ బాధ్యతలను యశస్వి జైస్వాల్, రుతురాజ్ గైక్వాడ్ తీసుకోనున్నారు. లేదంటే సంజూ శాంసన్ కూడా ఓపెనర్‌గా బరిలో దిగే ఛాన్స్ కనిపిస్తోంది.
గాయం నుంచి కోలుకున్న తర్వాత బుమ్రాకు ఇదే తొలి సిరీస్ కావడం గమనార్హం. ఈ సిరీస్‌కు సీనియర్ ఆటగాళ్లు దూరం కావడంతో బుమ్రాకు జట్టు సారథ్య బాధ్యతలు సెలక్టర్లు అప్పగించారు. అతడికి డిప్యూటీగా యువ ఓపెనర్ రుత్‌రాజ్ గైక్వాడ్ వ్యవహరించనున్నాడు.
వెస్టిండీస్‌తో జరిగిన తొలి టి20 మ్యాచ్‌లో బరిలోకి దిగిన తిలక్ వర్మ ఆకట్టుకున్నాడు. భారత్‌కు సమస్యగా ఉన్న నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన అతడు మంచి ప్రదర్శన చేశాడు. కేవలం 22 బంతుల్లోనే 39 పరుగులు చేశాడు. ఇందులో 2 ఫోర్లు, 3 సిక్సర్లు ఉండటం విశేషం.
ఐపీఎల్, దేశవాళీ క్రికెట్లో తన ప్రదర్శనతో ప్రభావం చూపిన తిలక్ వర్మను టీమిండియా మొదటిసారి స్క్వాడ్‌లో చేర్చి, తొలి మ్యాచ్‌లోనే అవకాశం అందించింది. అయితే బ్యాటింగ్ చేయడానికి ముందు తిలక్ వర్మ తన బలమైన ఫీల్డింగ్‌తో మ్యాచ్‌లో ప్రభావం చూపాడు.