Home » Tag » TALIBAN
ఆఫ్గాన్ శరణార్థుల విషయంలో ఐక్యరాజ్యసమితి కూడా జోక్యం చేసుకుంది. పాకిస్తాన్ లో ఉన్న మైగ్రేంట్స్ ను ఇబ్బంది పెట్టవద్దని సూచించింది. కానీ పాకిస్తాన్ లో ప్రస్తుతం ఉన్న తాత్కాలిక ప్రభుత్వం.. ఆఫ్గాన్ శరణార్థులకు దేశం విడిచి వెళ్ళాలని అక్టోబర్ 31 వరకూ డెడ్ లైన్ పెట్టింది. ఆ లోగా వెళ్ళకపోతే.. 20 లక్షల మందిని నిర్ధాక్షణ్యంగా పంపేస్తామని చెప్పింది. దాంతో ఇప్పుడు ఆఫ్గాన్ శరణార్థుల ఇష్యూ.. పాక్ పాలకులు, తాలిబన్ల మధ్య కొత్త ఉద్రిక్తతకు దారితీస్తోంది.
బహుశా ప్రపంచంలో ఏదేశంలోనూ మహిళలు ఇంత దారుణమైన, కఠినమైన జీవితాలను బతుకూ ఉండరేమో. కానీ ఏం పాపం చేసుకున్నారో తెలియదు.. ఆప్ఘనిస్తాన్ మహిళలు నిత్యం నరకం అనుభవిస్తున్నారు. తాలిబన్ల గుప్పిట్లో చిక్కుకుని విలవిలలాడిపోతున్నారు. స్వేచ్చావాయువల కోసం పరితపించిపోతున్నారు.
తాలిబన్లు.. అరాచకానికి వాళ్లు ఆధార్ కార్డులాంటి వారు.. వీళ్ల దారుణాల గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు.. వారు అఫ్గాన్‌లో అధికారంలోకి రాగానే అందరికంటే దారుణంగా తయారైంది మహిళల పరిస్థితి.. ఆఫ్గాన్‌లో ఆడపిల్లగా పుడితే చాలు భూమిమీదే నరకం స్పెల్లింగ్ రాయిస్తారు.. సారీ వారు రాయడానికి ఒప్పుకోరు కదా.. నరకాన్ని నేరుగా చూపిస్తారు.. రోజుకో రకం ఆంక్షలతో రెచ్చిపోతున్న ముష్కరమూక.. తాజాగా ఆరుబయట, పచ్చిక బయళ్లున్న రెస్టారెంట్లోకి మహిళలు, కుటుంబాల ఎంట్రీపై బ్యాన్ ప్రకటించింది.
తాలిబన్లు.. వీరి గురించి తెలుసుకోవాలంటే కాసేపు ఆఫ్ఘనిస్తాన్ చరిత్రను చూడాలి. ఈ దేశంలో ఎటు చేసినా ఎత్తైన పర్వతాలు దర్శనమిస్తాయి. సముద్రతీరానికి అస్సలు సంబంధంలేకుండా, కొన్ని లక్షల కోట్ల విలువ చేసే ఖనిజ సంపదను కలిగి ఉన్న ప్రాంతం. సుమారు 50వేల సంవత్సరాలకు పైబడిన చరిత్ర దీనికి ఉంది.