Home » Tag » tata group
పద్మశ్రీ రతన్ టాటా మరణం.. యావత్ భారతదేశానికి తీరని లోటు. లక్షల కోట్లు దానం చేసి కోట్ల కుటుంబాల్లో వెలుగులు నింపిన రతన్ టాటా ఇక లేరని తెలిసి ఇండియా మొత్తం కన్నీళ్లు పెట్టింది. ఇంతటి సేవామూర్తి తరువాత ఆ స్థానాన్ని ఎవరు అధిరోహిస్తారు అనేది అందరిలో ఉన్న ప్రశ్న.
ధేశ పారిశ్రామిక సామ్రాజ్యంలో ఓ శకం ముగిసింది. టాటా వ్యాపార సామ్రాజ్య పునాదుల్ని పటిష్ఠం చేసిన రతన్ టాటా అస్తమించారు. మరి టాటా సామ్రాజ్య వారసుడెవరు..? లక్షల కోట్ల విలువైన ఆ సంస్థను నడపబోయేది ఎవరు...? రతన్ టాటా తన వారసుడ్ని ఇప్పటికే సిద్ధం చేసి ఉంచారా...?
ప్రముఖ వ్యాపార దిగ్గజం, గొప్ప మానవతా వాది రతన్ టాటా ఇక లేరన్న వార్త ప్రపంచ వ్యాప్తంగా ఉన్న భారతీయులను కంట తడి పెట్టించింది. టాటా కంపెనీని ప్రతీ ఒక్కరికి చేరువ చేయడంలో రతన్ టాటా విజయం సాధించారు.
“శక్తివంతమైన నిర్ణయాలు నమ్మను, నిర్ణయాలను శక్తివంతంగా మారుస్తాను” ఇది రతన్ నావెల్ టాటా స్టైల్. ఏదైనా నిర్ణయం తీసుకోవాలంటే దాన్ని కరెక్ట్ చేయగలిగే దమ్ము ఉంటే తీసుకోవాలని భావితరాలకు తన చేతలతో చెప్పిన ధీరుడు రతన్ టాటా.
టాటా ఇది కేవలం ఒక పేరు మాత్రమే కాదు.. ప్రపంచం మెచ్చిన బ్రాండ్..వ్యాపారం అంటే డబ్బులు సంపాదించడం ఒక్కటే కాదు.. వ్యాపారం అంటే వ్యక్తిగత సామ్రాజ్యాలను విస్తరించుకోవడం కాదు..అంతకు మించి చాలా ఉంది అని నిరూపించిన సంస్థ టాటా గ్రూప్. విలువలు , సిద్ధాంతాలు, మానవీయత ఈ మూడు లక్షణాలు ఉన్న ఏకైక కంపెనీగా టాటా గ్రూప్‌ను చెపుతారు.
దేశంలోని టాప్ ఐటీ సంస్థలో.. టాటా కన్సల్టెన్సీ సర్వీస్ అలియాస్ టీసీఎస్ ఒకటి. టీసీఎస్‌లో జాబ్ వస్తే లైఫ్ సెటిల్.. ఓ ఢోకా ఉండదు అనుకుంటారు చాలామంది. ఐతే అలాంటి సంస్థను ఇప్పుడో సమస్య వెంటాడుతోంది. సంస్థలోని మహిళా ఉద్యోగులు.. ఒకరి తర్వాత ఒకరు.. మూకుమ్మడిగా రాజీనామాలు చేస్తున్నారు.
అత్యంత అధునాతనమైన హైడ్రోజన్ బస్సులు అతి త్వరలో రోడ్డుపై పరుగులు పెట్టనున్నాయి. తాజాగా మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ (meil) గ్రూప్ సంస్థ అయిన ఒలెక్ట్రా గ్రీన్ టెక్ ఈ బస్సులను ఆవిష్కరించింది. దీనికి కావల్సిన టెక్నాలజీని రిలయన్స్ గ్రూప్స్ ఆఫ్ ఇండస్ట్రీస్ అందజేసింది.