Home » Tag » Tax
టీమిండియా స్టార్ ప్లేయర్ రిషబ్ పంత్ క్రికెట్ జర్నీ ఓ అద్భుతమనే చెప్పాలి... ఎంతో టాలెంట్ తో జట్టులోకి వచ్చిన కొద్దికాలంలోనే కీలక ఆటగాడిగా ఎదిగాడు. ఆసీస్ గడ్డపై గబ్బాలో అతను ఆడిన చారిత్రాత్మక ఇన్నింగ్స్ ఎప్పటికీ ప్రత్యేకమే.. అయితే దురదృష్టవశాత్తూ రోడ్డు ప్రమాదానికి గురై చావు అంచుల వరకూ వెళ్ళాడు.
2018-19 సంవత్సరానికిగాను సరైన సమయంలో బ్యాంకు ఖాతాల వివరాలను సమర్పించని కారణంగా బ్యాంకు ఖాతాల్ని ఇన్కమ్ ట్యాంక్స్ డిపార్ట్మెంట్ నిలిపివేసింది. ఆ సమయంలో కాంగ్రెస్.. 45 రోజులు ఆలస్యంగా లావేదేవీల వివరాలు సమర్పించింది.
మీకొక కథ చెబుతాం. ఆ కథలో ఓ పెద్ద రాజ్యం.. దానికి ఓ రాజు ఉన్నారు. ఇతర రాజ్యాల మీద దండయాత్రలు చేసి శతాబ్దాల పాటు ఈ పెద్ద రాజ్యం సుభిక్షంగానే ఉంది. కాలంతో పాటు పరిస్థితులు మారిపోయాయి. పెద్ద రాజ్యానికి కూడా కష్టాలు మొదలయ్యాయి. ఒకప్పుడు బాగా బతికిన ప్రజలు ఇప్పుడు తినడానికి తిండి లేక ఇబ్బంది పడుతున్నారు. ఉపాధి అవకాశాలు లేక చాలా మంది దుర్భర జీవితాన్ని అనుభవిస్తున్నారు. ఇంత జరుగుతున్నా ఆ రాజు గారిలో మాత్రం చలనం లేదు. రాజుగా ప్రజల కష్టాలను తీర్చకపోగా ప్రజలు కట్టే పన్నులతో విలాసాల్లో మునిగితేలుతున్నారు. దేశం క్లిష్టపరిస్థితుల్లో ఉంటే రాజు గారు మాత్రం తన పట్టాభిషేకం కోసం జనం సొమ్ముతో కులుకుతున్నారు.
కలియుగ ప్రత్యక్షదైవం వెంకన్నకు పన్నుపోటు పడింది. వెంకన్న తప్పు చేశాడంటూ కేంద్రం, రిజర్వ్‌బ్యాంక్ నోటీసులు ఇచ్చింది. నోటీసులే కాదు జరిమానా వేసింది దాన్ని వసూలు చేసింది కూడా... విదేశీ నిధుల వివరాలు చెప్పలేదని ఈ జరిమానాలట...! ధార్మిక సంస్థ టీటీడీని కూడా కేంద్రం వ్యాపార సంస్థగా లెక్కకట్టడం ఎంతవరకు సబబు..