Home » Tag » TDP-Janasena
ఉమ్మడి విశాఖపట్టణం (Visakhapatnam) జిల్లాలో మిగతా అన్ని సీట్లు ఒక లెక్క. పాయకరావుపేట ఒక లెక్క అంటోందట వైసీపీ (YCP). టీడీపీ అభ్యర్థి వంగలపూడి అనిత (Vangalapudi Anitha) టార్గెట్‌గా ఎక్స్ ట్రా డోస్ ఇవ్వాలనుకుంటోందట అధికారపార్టీ అధినాయకత్వం.
జనసేన (Janasena) సెకండ్ లిస్ట్ కోసం ఆ పార్టీ నేతలు టెన్షన్ తో వెయిట్ చేస్తున్నారు. 24 అసెంబ్లీ 3 లోక్ సభ స్థానాల్లో జనసేన పోటీ చేస్తుందని ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ప్రకటించారు. కానీ ఐదు అసెంబ్లీ సీట్లకు మాత్రమే అభ్యర్థులను ప్రకటించారు. మిగిలిన 19 అసెంబ్లీ సీట్ల సంగతి ఏంటి... మూడు పార్లమెంటు స్థానాల్లో పోటీ చేసేది ఎవరు అని జనసేన లీడర్లు ఎదురు చూస్తున్నారు.
నన్ను ప్రశ్నించడం కాదు... నాకు అండగా నిలబడండి అంటూ తాడేపల్లి గూడెం సభలో పవర్ పంచ్ ఇచ్చారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. అది ఎవరికి తగలాలో వాళ్ళకి తగిలింది. దాంతో పవన్ ను ఉద్దేశించి రెండు లెటర్లు టక్కున రిలీజ్ అయ్యాయి. అందులో ఒకటి మాజీ మంత్రి హరిరామ జోగయ్యది అయితే... మరొకటి కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం (Mudragada Padmanabham) రాశారు.
అత్యంత కీలకమైన ఆ రెండు చోట్ల సీట్ల సిగట్లు మూడు పార్టీల అధిష్టానాలకు ముచ్చెమటలు పట్టిస్తున్నాయి. ఇంకా చెప్పాలంటే పార్టీ పెద్దలకు తలబొప్పి కడుతోంది. అంతర్గత వ్యవహారాలు రచ్చకెక్కి అధిష్టానాలను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. వైసీపీ(YCP), టీడీపీ(TDP), జనసేన(Janasena)... ఇలా మూడు పార్టీల పెద్దల్ని ముప్పు తిప్పలు పెడుతున్న అసెంబ్లీ సిగ్మెంట్స్ పరిస్తితి ఇది.
ఇంకొన్ని రోజుల్లో ఏపీలో ఎన్నికలు ( AP Elections) జరగబోతున్నాయ్. దీంతో రాజకీయం రంజు మీద కనిపిస్తోంది. పొత్తులో ఉన్న టీడీపీ(TDP), జనసేన(Janasena).. బీజేపీని కూడా చేర్చుకుందామని ప్రయత్నాలు చేస్తుంటే.. వైసీపీ (YCP) మాత్రం సింగిల్‌గా ఫైట్‌కు సిద్ధం అవుతోంది. నియోజకవర్గ ఇంచార్జిలను మార్చుతూ వైసీపీ తీసుకుంటున్న నిర్ణయాలు..
ఆంధ్రప్రదేశ్ లో బీజేపీకి ఆదరణ అంతంత మాత్రమే. రాష్ట్ర విభజన కోపంతో అక్కడి జనం కాంగ్రెస్ పార్టీని పూర్తిగా పక్కన పెట్టేశారు. అందుకు కారణమైన మరో పార్టీ బీజేపీది కూడా దాదాపు అదే పరిస్థితి. కాకపోతే వ్యక్తి ఇమేజ్ కారణంగా, మోడీ మేనియాతో... 2019 అసెంబ్లీ ఎన్నికల్లో కొందరు ఎమ్మెల్యేలుగా గెలిచారు.
ఏపీలో ఎన్నికలు దగ్గరపడుతుండటంతో... వైసీపీ వరుసగా తమ అభ్యర్థులను ప్రకటిస్తోంది. కానీ టీడీపీ - జనసేన (TDP-Janasena) కూటమి నుంచి ఇంకా అధికారికంగా ఎలాంటి లిస్ట్ బయటకు రాలేదు. అయితే గత రెండు రోజులుగా చంద్రబాబు హైదరాబాద్ లో ఉండి... పార్లమెంట్, అసెంబ్లీ అభ్యర్థులపై కసరత్తు చేస్తున్నట్టు చెబుతున్నారు. ముందుగా ఎంపీ స్థానాలపై ఆయన దృష్టిపెట్టినట్టు సమాచారం.
ఉమ్మడి కృష్ణా జిల్లాలో టీడీపీ-జనసేన (TDP-Janasena) మధ్య సీట్ల పంచాయితీ ఇంకా కొలిక్కిరావడం లేదు. జిల్లాలో జనసేన (Janasena) కచ్చితంగా నాలుగు స్థానాలను కేటాయించాలని... తెలుగుదేశం పార్టీకి (Telugu Desam Party) తేల్చి చెప్పినట్టు చర్చ జరుగుతోంది. స్థానికంగా ఉన్న పరిస్థితుల దృష్ట్యా... అటు టీడీపీ (TDP) నేతలు కూడా సీట్ల కేటాయింపు వ్యవహారంలో పావులు కదుపుతున్నారని సమాచారం.
అష్టదిగ్బంధనం అంటే తెలుసు కదా.. అన్ని వైపుల నుంచి ప్రమాదం ముంచెత్తిసినప్పుడు.. ఏమీ చేయలేని.. చేయడానికి ఏమీ లేని పరిస్థితుల్లో చేతులెత్తేసేంత ప్రమాదం. ఇప్పుడు జగన్ అలాంటి పరిస్థితుల్లోనే ఇరుక్కున్నారా అంటే.. అవును అనే చర్చ జరుగుతోంది రాజకీయవర్గాల్లో ! ఓ వైపు టీడీపీ, జనసేన (TDP-Janasena) పొత్తులు.. మరోవైపు
ఏదైనా ఒకసారి జరిగింది.. రెండోసారి కూడా జరిగింది అంటే.. అది కచ్చితంగా మూడోసారి జరిగి తీరుతుంది. కన్ఫ్యూజింగ్గా ఉందా ! టీడీపీ, జనసేన (TDP-Janasena) పొత్తుల వ్యవహారం, సీట్ల పంచాయితీ ఇలానే ఉంది.