Home » Tag » team
సుధీర్ఘమైన ఆస్ట్రేలియా పర్యటన ముగిసింది. కేవలం ఒకే ఒక్క టెస్ట్ మ్యాచ్ విజయంతో సరిపెట్టుకున్న టీమిండియా ఈ సారి బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని గెలవలేకపోయింది. ఇక తర్వాతి సిరీస్ లో ఇంగ్లాండ్ తో సొంతగడ్డపై వైట్ బాల్ మ్యాచ్ లకు రెడీ కానుంది. ఆ తర్వాత ఛాంపియన్స్ ట్రోఫీ ఆడనుంది.
ఆస్ట్రేలియా టూర్ లో భారత బ్యాటర్ల ఆటతీరు ఏం మారలేదు. సిరీస్ చేయాలంటే బాగా ఆడాల్సిన చివరి టెస్టులోనూ మన బ్యాటర్లు చేతులెత్తేశారు. పాత కథనే రిపీట్ చేస్తూ తక్కువ స్కోరుకే పరిమితమయ్యారు. భారత బ్యాటర్ల ఫ్లాప్ షోతో టీమిండియా 185 పరుగులకే ఆలౌటైంది.
గ్రౌండ్ లో హుందాగా ప్రవర్తించడం తమకు అలవాటు లేదని ఆస్ట్రేలియా క్రికెటర్లు ఎప్పటికప్పుడు నిరూపిస్తూనే ఉంటారు.. అంపైర్ కు అతిగా అప్పీల్ చేయడం, ప్రత్యర్థి ఆటగాళ్ళను స్లెడ్జింగ్ చేయడం వంటి చర్యలతో వార్తల్లో నిలుస్తుంటారు.
ప్రపంచ క్రికెట్ లో రెండు అత్యుత్తమ జట్లు తలపడితే అభిమానులకు అంతకుమించిన కిక్ మరేముంటుంది... అందులోనూ ఇయర్ ఎండింగ్.. క్రిస్ మస్ హాలిడేస్... ఇక వేరే చెప్పాలా... పైగా మ్యాచ్ జరుగుతోంది భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య... అది కూడా ప్రతిష్టాత్మక బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో ప్రతీ మ్యాచ్ రసవత్తరమే..
క్రికెట్ లో ఆస్ట్రేలియా అంటేనే ఛీటింగ్... ఔట్ కాకున్నా పదేపదే అప్పీల్ చేయడం... ప్రత్యర్థి బ్యాటర్లను స్లెడ్జింగ్ చేయడం... పదేపదే మాటలతో రెచ్చగొట్టం... గెలుపు కోసం ఇవీ కంగారూలు చేసే పనులు... ప్రస్తుత బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలోనూ ఇదే ఫాలో అవుతోంది... వాళ్ళకు తోడు చెత్త అంపైరింగ్ కూడా కలిసింది...
భారత్-ఆస్ట్రేలియా మధ్య బోర్డర్-గవాస్కర్ సిరీస్లో నాలుగో టెస్టు డిసెంబర్ 26 నుంచి మెల్బోర్న్లో జరగనుంది. ప్రస్తుతం సిరీస్ 1-1తో సమమైంది. అయితే ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ రేసులో నిలవడానికి భారత్, ఆస్ట్రేలియాకు నాలుగో టెస్ట్ మ్యాచ్ కీలకంగా మారింది.
అఫ్గనిస్తాన్ క్రికెట్ జట్టు సరికొత్త చరిత్ర సృష్టించింది. తమ వన్డే ఫార్మాట్ చరిత్రలో పరుగుల పరంగా అతిపెద్ద విజయం నమోదు చేసింది. జింబాబ్వేతో రెండో వన్డేలో ఈ ఘనత సాధించింది.
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ నిర్వహణపై సస్పెన్స్ కు తెరపడింది. ఈ మెగా టోర్నీని హైబ్రిడ్ పద్ధతిలోనే నిర్వహించాలని ఐసీసీ నిర్ణయించింది. తాజాగా ఐసీసీ అధికారిక ప్రకటన జారీ చేసింది.
ఆస్ట్రేలియా క్రికెటర్ ట్రావిస్ హెడ్ టీమిండియాకు తలనొప్పిలా తయారయ్యాడు. పెద్ద టోర్నీల్లో ఇప్పటికే పలుసార్లు భారత్ కు కొరకరాని కొయ్యలా మారిన హెడ్ తాజాగా సొంతగడ్డపైనా దుమ్మురేపుతున్నాడు. భారత్ అంటేనే చెలరేగిపోయే ఈ ఆసీస్ హిట్టర్ గబ్బా వేదికగా జరగుతున్న మూడు టెస్టులోనూ సెంచరీతో కదం తొక్కాడు.
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో విరాటపర్వం చూపిస్తాడనుకుంటే ఫ్యాన్స్ కు నిరాశే మిగిలింది. పెర్త్ వేదికగా జరిగిన తొలి టెస్టులో విరాట్ ఘోరంగా విఫలమయ్యాడు. తొలి ఇన్నింగ్స్ లో కేవలం ఐదు పరుగులు మాత్రమే చేశాడు.