Home » Tag » team india
టీమిండియాలో చోటు దక్కించుకోవాలంటే దేశవాళీ క్రికెట్ లో ప్రదర్శనే ప్రామాణికం...అందుకే చాలా మంది యువ క్రికెటర్లు రంజీ ట్రోఫీతో పాటు పలు దేశవాళీ టోర్నీలపైనే ఫోకస్ పెడుతుంటారు.
టీమిండియా సీనియర్ పేసర్ మహ్మద్ షమీని అతని మాజీ భార్య హసీస్ జహాన్ మళ్ళీ టార్గెట్ చేసింది. షమీ చాలా కాలం తర్వాత ఇటీవల తన కుమార్తెను కలుసుకున్నాడు. కుమార్తెతో కలిసి షాపింగ్ చేసిన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.
భారత్,బంగ్లాదేశ్ టీ ట్వంటీ సిరీస్ కు ఆదివారం నుంచే తెరలేవనుంది. గ్వాలియర్ వేదికగా తొలి మ్యాచ్ జరగబోతోంది. ఇరు జట్లు ఇప్పటికే నెట్స్ లో ముమ్మరంగా ప్రాక్టీస్ చేస్తున్నాయి. సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలోని భారత్ యువ జట్టు ఘనవిజయంతో సిరీస్ ఆరంభించాలని భావిస్తోంది.
ఐపీఎల్ మెగావేలం రిటెన్షన్ రూల్స్ ను బీసీసీఐ ఖరారు చేయడంతో ఫ్రాంచైజీలు తమ జాబితాపై తుది కసరత్తు చేస్తున్నాయి. గతంలో నలుగురికే రిటెన్షన్ ఛాన్స్ ఉండగా.. ఈ సారి బీసీసీఐ ఆరుగురికి అవకాశమిచ్చింది.
బంగ్లాదేశ్ తో టెస్ట్ సిరీస్ ను వైట్ వాష్ చేయడం ద్వారా టీమిండియా సొంతగడ్డపై తమకు తిరుగులేదని మరోసారి నిరూపించుకుంది. ముఖ్యంగా కాన్పూర్ టెస్టులో అద్భుతమైన వ్యూహంతో గెలుపును అందుకుంది
ఆస్ట్రేలియాతో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని గెలిచి హ్యాట్రిక్ కొట్టాలనుకున్న టీమిండియాకు షాక్ తగిలేలా కనిపిస్తోంది. సీనియర్ పేస్ బౌలర్ మహ్మద్ షమీ ఆసీస్ టూర్ లో ఆడడం అనుమానంగా మారింది. మోకాలి గాయం తిరగబెట్టడమే దీనికి కారణం.
టెస్ట్ మ్యాచ్ ఫలితం ఒక్కోసారి రెండు లేదా రెండున్నర రోజుల్లో వచ్చిన సందర్భాలున్నాయి... కానీ మొదటి రెండున్నర రోజుల్లోనే అలా మ్యాచ్ రిజల్ట్ వచ్చేవే ఎక్కువ.. ఇక ఫ్లాట్ వికెట్ అయితే డ్రాగా ముగిసిన మ్యాచ్ లే ఎక్కువగా కనిపిస్తాయి.
బంగ్లాదేశ్ తో టెస్ట్ సిరీస్ ను వైట్ వాష్ చేయడమే లక్ష్యంగా టీమిండియా సిద్ధమైంది. శుక్రవారం నుంచి కాన్పూర్ గ్రీన్ పార్క్ స్టేడియం వేదికగా రెండో టెస్ట్ మొదలుకాబోతోంది.
బంగ్లాదేశ్ తో టీమిండియా రెండో టెస్ట్ శుక్రవారం నుంచి మొదలుకాబోతోంది. ఇప్పటికే ప్రాక్టీస్ లో బిజీగా ఉన్న భారత్ 2-0 తో సిరీస్ కైవసం చేసుకోవడమే లక్ష్యంగా పెట్టుకుంది. కాన్పూర్ పిచ్ స్పిన్నర్లకే అనుకూలించనున్న నేపథ్యంలో రవిచంద్రన్ అశ్విన్ మరోసారి తన మ్యాజిక్ చూపిస్తాడన్న అంచనాలు మొదలయ్యాయి.
వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ టైటిల్ భారత్ ను ఊరిస్తోంది. గత రెండు పర్యాయాలు ఫైనల్ చేరినప్పటకీ ఛాంపియన్ గా నిలవలేకపోయింది. ఒకసారి కివీస్ , మరోసారి ఆసీస్ టీమిండియా జోరుకు బ్రేక్ వేశాయి.