Home » Tag » techies
నవంబర్ 30న తెలంగాణలో ఎలక్షన్ పోలింగ్ జరగబోతోంది. అంటే సరిగ్గా 3 రోజులే మిగిలి ఉంది. రాష్ట్రం మొత్తం సంగతి పక్కన పెడితే.. హైదరాబాద్ ఓటర్లు, మరీ ముఖ్యంగా సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో పని చేసేవాళ్లు ఇప్పుడు రాజకీయా పార్టీలను టెన్షన్ పెడుతున్నారు.
ఒకప్పటి ఐటీ రంగులు కళకళలాడాయి. అయితే ప్రస్తుతం పరిస్థితులు వీటికి భిన్నంగా మారి వెలవెలబోతున్నాయి. తాజాగా భారతీయ ఐటీ రంగానికి చెందిన ఒక నివేదిక కీలకమైన విషయాలను వెల్లడించింది.
ఐయామ్ సారీ.. తప్పనిసరి పరిస్థితుల్లో ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. మరో మార్గం కనిపించడం లేదు.. నన్ను క్షమించండి.. భారీగా ఉద్యోగాలకు కోత పెడుతూ వేలాది మందిని ఇంటికి పంపించాల్సిన పరిస్థితికి చింతిస్తూ గూగుల్ మాతృ సంస్థ ఆల్ఫాబెట్ సీఈవో సుందర్ పిచాయ్ మూడు నెలల క్రితం చేసిన ప్రకటన ఇది. ప్రపంచంలోనే ది బెస్ట్ వర్క్ ప్లేస్ గా పేరు తెచ్చుకున్న గూగుల్ కూడా పెద్ద ఎత్తున ఉద్యోగాలు తొలగించడంతో.. టెక్కీలు ఊసురోమంటూ ఇంటిదారి పట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది.
కొన్నేళ్లక్రితం ఏం చేస్తున్నావని ఎవర్ని పలకరించినా సాఫ్ట్వేర్ అని కాలర్ ఎగరేసుకుంటూ చెప్పేవాళ్లు. కానీ ఇప్పుడా పరిస్థితి కనిపించడం లేదు. పేరుకు పెద్ద పెద్ద కంపెనీల్లో పనిచేస్తున్నా.. సాఫ్ట్ వేర్ ఇంజినీర్ అంటూ ట్యాగ్ ఉన్నా.. చేస్తున్న ఉద్యోగం ఎంతకాలం ఉంటుందో.. ఎప్పుడు పింక్ స్లిప్ చేతికొస్తుందో అర్థంకాని పరిస్థితి.