Home » Tag » Telangana CM Revanth Reddy
మాటలు ఉన్నవి.. కమ్యూనికేట్ చేసుకునేందుకు ! నాలుక కదులుతుంది కదా అని... మేధావితనం ముసుగులో నానా చెత్త వాగితే.. తోలు తీసేస్తారు. ఇదంతా ఎందుకు అనుకుంటున్నారా.. ప్రణీత్ హనుమంతు అనే యూట్యూబర్ నోటి దూలతో.. జరుగుతున్న రచ్చ అంతా ఇంతా కాదు.
తెలంగాణలో (Telangana Govt) త్వరలో అతిపెద్ద భారీ స్కామ్ (Biggest Scam) బయటపడబోతోంది. బీఆర్ఎస్ హయాంలో (BRS Govt) నియమితులైన రిటైర్డ్ ఉద్యోగులను (Retired employees) ఏరివేసే పనిలో ఉన్నారు సీఎం రేవంత్ రెడ్డి. దీనికి సంబంధించి లిస్ట్ ను తెప్పించుకున్నారు. ప్రభుత్వంలోని అన్ని శాఖల్లో కలిపి వెయ్యి 49 మంది రిటైర్డ్ ఉద్యోగులు కొనసాగుతున్నట్టు తేలింది.
కర్ణాటక, తెలంగాణలో అధికారంలో దక్కించుకున్న కాంగ్రెస్.. సౌత్‌లో మంచి జోష్ మీద కనిపిస్తోంది. లోక్‌సభ ఎన్నికల్లోనూ ఇలాంటి ఫలితాలే చూపించాలని స్ట్రాటజీలు సిద్ధం చేస్తోంది. ఫిబ్రవరి ఎండింగ్ లేదంటే.. మార్చిలో పార్లమెంట్ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయ్. దీంతో ఇప్పటినుంచే హస్తం పార్టీ వ్యూహాలకు పదునుపెడుతోంది. లోక్‌సభ ఎన్నికలపై ఇప్పటికే ఆ పార్టీ అధినాయకత్వం కసరత్తు ముమ్మరం చేసింది.
తెలంగాణలో త్వరలో జిల్లాల సరిహద్దుల్లో మార్పులు, చేర్పులు రాబోతున్నాయి. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఓ ప్రాతిపదిక లేకుండా ఇష్టమొచ్చినట్టు విభజించారని అంటున్నారు సీఎం రేవంత్ రెడ్డి. అందుకే జిల్లాల శాస్త్రీయ విభజనకు ఓ కమిషన్ ఏర్పాటు చేస్తామంటున్నారు.
మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గాయం నుంచి క్రమంగా కోలుకుంటున్నారు. ప్రస్తుతం యశోద హాస్పిటల్లో డాక్టర్ల పర్యవేక్షణలో ఆయన ఉన్నారు. కేసీఆర్‌కు హిప్ రీప్లేస్మెంట్ ఆపరేషన్ చేసిన డాక్టర్లు 24 గంటలు తిరగకముందే ఆయనతో వాకింగ్ కూడా చేయించారు. మరి కొన్ని వారాల పాటు కేసీఆర్ బెడ్ రెస్ట్ తీసుకోబోతున్నారు. ఎప్పుడూ రాజసం ఉట్టిపడేలా మీటింగ్‌లలో గర్జించే కేసీఆర్‌ను ఈ పరిస్థితిలో చూసి బీఆర్ఎస్ కార్యకర్తలు, ఆయన అభిమానులు తల్లిడిల్లిపోతున్నారు.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మాజీ సీఎం కేసీఆర్ ను పరామర్శించారు. తెలంగాణ ముఖ్యమంత్రి వెంట మంత్రి మంత్రి సీతక్క, షబ్బీర్ అలీ ఉన్నారు. ముందుగా మొదటి సారి సీఎం హోదాలో యశోద ఆసుపత్రికి వచ్చిన రేవంత్ రెడ్డి ఆసుపత్రి యాజమన్యం స్వాగతం పలికింది. అనంతరం కేసీఆర్ వద్దకు మాజీ మంత్రి కేటీఆర్ రేవంత్ చేతిలో చేయి వేసి ఓనికి వెళ్లారు. కేటీఆర్ తో కలిసి కేసీఆర్ ను పరామర్శించించారు.
యశోద ఆసుపత్రికి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి.. మరి కాసేపట్లో సీఎం రేవంత్ రెడ్డి యశోద ఆసుపత్రికి వెళ్లనున్నారు. మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కలిసి పరామర్శించనున్నారు. ప్రస్తుతం కేసీఆర్ సోమాజిగూడలోని యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. రేవంత్ రెడ్డి మధ్యాహ్నం ఆసుపత్రికి వెళ్లి కేసీఆర్ ప్రమాదం ఆరా తీయనున్నారు. ఇక శుక్రవారం కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ ఆధ్వర్యంలో కేసీఆర్ కు 20 మంది వైద్యుల బృందం సర్జరీ నిర్వహించింది. ఆ తర్వాత పలువు సీనియర్ జానారెడ్డి వంటి నాయకులు ఆసుపత్రికి వెళ్లి పరామర్శిస్తున్నారు.