Home » Tag » Telangana Congress Party
తెలంగాణ కాంగ్రెస్ లో జూన్ 4 ఫలితాల తర్వాత కీలక మార్పులు జరగబోతున్నాయి. పీసీసీ చీఫ్ పదవి నుంచి సీఎం రేవంత్ రెడ్డి తప్పుకోబోతున్నారు.
కాంగ్రెస్ పార్లమెంటరీ (Congress Parliamentary) పార్టీ ఛైర్ పర్సన్ సోనియాగాంధీ తెలంగాణ (Telangana) నుంచి పోటీ చేసే అవకాశాలు కనిపించడం లేదు. ఖమ్మం లోక్ సభ స్థానం నుంచి పోటీ చేయాలని ... సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు ఈమధ్యే సోనియాను కలసి విజ్ఞప్తి చేశారు. కానీ ఆమె ఆరోగ్యం, వయస్సు రీత్యా లోక్ సభ ఎన్నికల్లో (Lok Sabha Elections) పోటీకి సుముఖంగా లేరని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. దాంతో సోనియాగాంధీ హిమాచల్ ప్రదేశ్ స్టేట్ నుంచి రాజ్యసభ ఎంపీగా నామినేషన్ వేస్తారని అంటున్నారు.
ఎమ్మెల్సీ అవుతాను... శాసనమండలిలో అడుగుపెట్టి అధ్యక్షా అంటా అనుకున్న నిర్మాత బండ్ల గణేష్ (Producer Bandla Ganesh) కు జాక్ పాట్ తగిలిందా... ఎమ్మెల్సీ కాదు... ఏకంగా ఎంపీ పోస్టే ఇవ్వాలని TPCC డిసైడ్ అయిందా...? పార్లమెంట్ (Parliament) కి వెళ్ళి... అక్కడ అధ్యక్షా అనే అవకాశం కల్పిస్తోందా... మల్కాజ్ గిరి (Malkaj Giri) నియోజకవర్గానికి బండ్ల గణేష్ దరఖాస్తు చేయడంతో కాంగ్రెస్ వర్గాల్లో ఇదే హాట్ టాపిక్ అయింది.
కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెచ్చేందుకు తెలంగాణలో చాలా మందే కష్టపడ్డారు. బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా ఉన్నవాళ్లంతా కాంగ్రెస్ గెలుపు కోసం పని చేశారు. కొందరు పార్టీలో చేరి ప్రత్యక్షంగా పని చేస్తే.. కొందరు మాత్రం పార్టీకి దూరంగా ఉంటూనే పరోక్ష సాయం అందించారు.
కర్నాటకలో కాంగ్రెస్ పార్టీ గెలుపు ఖాయమని ఒపీనియన్ పోల్ సర్వేలు స్పష్టం చేస్తున్నాయి. ఇదే జరిగితే పక్కనున్న తెలంగాణలో కూడా కాంగ్రెస్ పార్టీకి బూస్టప్ లభించడం ఖాయం. నైతికంగా బీజేపీని ఎదుర్కొనేందుకు మరింత శక్తి లభిస్తుంది.
కాంగ్రెస్ పార్టీలో కోమటిరెడ్డి కల్లోలం రేపారు. తన వ్యక్తిగత ప్రయోజనాలకోసం పార్టీని వాడుకుంటున్నారనే టాక్ పార్టీలో బలంగా వినిపిస్తోంది. తాజాగా బీఆర్ఎస్ తో కాంగ్రెస్ కలుస్తుందనే వ్యాఖ్యలు తీవ్ర కలకలం రేపుతున్నాయి.