Home » Tag » Telangana election
మొన్నటి వరకూ తెలంగాణ పాలిటిక్స్ దేశం మొత్తాన్ని అట్రాక్ట్ చేశాయి. తెలంగాణ ఎలక్షన్లో జరిగిన నెక్ టు నెక్ ఫైట్.. ప్రతీ ఒక్కరిలో ఉత్కంఠ రేపింది. చివరి నిమిషం వరకూ కూడా హోరాహోరీ పోరు సాగింది. ఇలాంటి త్రిల్లింగ్ పాలిటిక్స్ ఈ మధ్య కాలంలో ఎప్పుడూ చూడలేదు అకున్నారు అంతా. కానీ ఇప్పుడు ఏపీ పాలిటిక్స్‌లో వరుసగా జరుగుతున్న పరిణామాలు అంతకంటే త్రిల్లింగ్‌గా మారిపోయాయి.
ఈ ఎన్నికలలో రామ్మోహన్ రెడ్డి మక్తల్ నుంచి బీఆర్ఎస్ తరఫున పోటీ చేయగా పర్ణిక రెడ్డి నారాయణపేటలో కాంగ్రెస్ నుంచి పోటీ చేశారు. అయితే.. రామ్మోహన్ రెడ్డి ఓటమి పాలవగా పర్ణిక విజయం సాధించారు. ఇక్కడ ఇంకో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. సీనియర్ నేత, మాజీ మంత్రి డీకే అరుణ పర్ణిక రెడ్డికి మేనత్త అవుతారు.
ఆరుసార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎంపీగా గెలిచి.. ఒక్కసారి కూడా ఓటమి ఎరుగని నేతగా ఉన్న మంత్రి ఎర్రబెల్లి దయాకరరావును 26 ఏళ్ల యశస్విని రెడ్డి ఓడించడం తెలంగాణ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టించిందనే చెప్పాలి. వయస్సు పరంగా పిన్న వయస్కురాలు కావడమే కాదు.. ఆమెకు రాజకీయంగానూ ఎలాంటి అనుభవం లేదు.
సికింద్రాబాద్ కంటోన్మెంట్లో బీఆర్ఎస్ నుంచి దివంగత మాజీ ఎమ్మెల్యే సాయన్న కూతురు లాస్యనందిత బరిలో నిలవగా, కాంగ్రెస్ అభ్యర్థిగా దివంగత విప్లవ గాయకుడు గద్దర్ కూతురు వెన్నెల బరిలో నిలిచారు. వీరిద్దరూ తమ తండ్రుల గుర్తింపుతోనే ప్రచారంలో విరివిగా పాల్గొన్నారు.
హ్యాట్రిక్ అధికారమే లక్ష్యంగా పావులు కదుపుతున్న బీఆర్ఎస్కు.. బీజేపీ, కాంగ్రెస్ ముచ్చెమటలు పట్టిస్తున్నాయ్. మళ్లీ తమదే అధికారం అని కేసీఆర్, కేటీఆర్, హరీష్ పైకి ధీమాగా చెప్తున్నా.. కారు పార్టీ నేతలను తెలియని టెన్షన్ మాత్రం అలానే వెంటాడుతోంది. దీనికితోడు కారుకు అనుకూల పవనాలు లేవనే సర్వే నివేదికలు మరింత టెన్షన్ పుట్టిస్తున్నాయ్. దీనికితోడు రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ అందించిన సర్వే రిపోర్టుతో మరింత కంగారు మొదలైనట్లు తెలుస్తోంది.
తెలంగాణలో ఎన్నికల డంఖా మోగితే చాలు.. సీఎం కేసీఆర్ తన నామినేషన్ పత్రాలను వెంకన్న చెంతకు తీసుకెళ్తారు. ఆ స్వామికి ప్రత్యేక పూజలు చేసిన తర్వాతే నామినేషన్ పనులు ప్రారంభిస్తారు. వెంకన్న అంటే సీమ తిరుమల, ఆంధ్రా వాడపల్లి కాదు.. తెలంగాణ కోనాయిపల్లి వేంకటేశ్వరస్వామి. శ్రీనివాసుడు ఎక్కడైనా శ్రీనివాసుడే కానీ సీఎం కేసీఆర్ కు మాత్రం కోనాయిపల్లి వేంకటేశుడంటే చాలా స్పెషల్.