Home » Tag » Telangana Ministers
తెలంగాణాలో కేబినెట్ విస్తరణ కోసమని ఓ లిస్ట్ తీసుకొని వెళ్ళారు సీఎం రేవంత్ రెడ్డి. కానీ ఏమైందో ఏమో... కేబినెట్ లేదు... విస్తరణ లేదు... అంతా మీరే రాసుకుంటున్నారు... మీరే చెబతున్నారు. అన్ని శాఖలకీ మంత్రులు ఉన్నారు. ఇప్పుడు ఆ అవసరం ఏమొచ్చింది అంటూ ఢిల్లీలో జరిగిన ప్రెస్ మీట్ లో తేల్చేశారు రేవంత్ రెడ్డి. దాంతో మంత్రివర్గ విస్తరణపై ఆశ పెట్టుకున్న కాంగ్రెస్ లీడర్లు, BRS జంపింగ్ జపాంగ్స్ డీలా పడ్డారు.
తెలంగాణలో 37 కార్పొరేషన్లకు ఛైర్మన్లను నియమిస్తూ గుట్టు చప్పుడు కాకుండా లిస్ట్ రిలీజ్ చేసింది ప్రభుత్వం. అయితే అధికారిక ఉత్తర్వులు మాత్రం విడుదల కాలేదు. మార్చి 14న లిస్ట్ రిలీజ్ అయినా.. 16 రాత్రి వరకూ బయట పెట్టలేదు
తెలంగాణలో కొత్తగా ప్రమాణం చేసిన మంత్రులకు శాఖల కేటాయింపు జరిగింది. ఆయా మంత్రులు అనుభవాలను దృష్టిలో పెట్టుకొని శాఖలను కేటాయించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. కీలకమైన హోంశాఖ, మున్సిపల్ వ్యవహారాలు, విద్యాశాఖలను తన దగ్గరే పెట్టుకున్నారు సీఎం. ప్రస్తుతం రేవంత్ కేబినెట్ లో ఆయనతో సహా 12 మంది ఉన్నారు. మరో ఆరుగురు మంత్రులను ఇంకా చేర్చుకునే అవకాశాలు ఉన్నాయి. ఈలోగా ప్రమాణం చేసిన మంత్రులకే అదనపు శాఖలను కూడా అప్పగించారు సీఎం రేవంత్.
నేడు అధికారికంగా తెలంగాణ రాష్ట్ర మంత్రులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రిత్వ శాఖలను కేటాయించారు. మంత్రులకు శాఖల కేటాయింపు విషయంపై శుక్రవారం ఢిల్లీ వెళ్లిన సీఎం.. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అగ్రనేత రాహుల్, గాంధీ, పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ తో సూదీర్ఘ చర్చలు జరిపిన.. అనంతరం మంత్రుల శాఖలపై శనివారం ఓ ప్రకటన చేశారు.
రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ చిత్రంలోని నాటు నాటు పాటకు ఆస్కార్ వరించిన విషయం మనకు తెలిసిందే. దీనికి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేకంగా కీరవాణి, చంద్రబోస్ లను సన్మానించింది. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర మంత్రలు శ్రీనివాస్ యాదవ్, శ్రీనివాస్ గౌడ్ పాల్గొన్నారు.